Big Stories

Blood donation: పీరియడ్స్ టైంలో మహిళలు బ్లడ్ డొనేట్ చేయవచ్చా ?

Blood donation: రక్తదానం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. రక్తదానం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జీవితాలను కాపాడవచ్చు. శరీరం నుండి కొద్ది మొత్తంలో రక్తాన్ని అవసరమైన వ్యక్తికి ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యాన్ని, ప్రాణాలను రక్షించవచ్చు. గాయపడిన వ్యక్తిని రక్షించడానికి, చికిత్స చేసుకునే వ్యక్తికి లేదా శస్త్రచికిత్స సమయంలో రక్తం దానం చేయడం వల్ల ఉపయోగపడుతుంది. అయితే చాలా మందికి రక్తదానం చేయడానికి కొన్ని అనుమానాలు ఉంటాయి. రక్తం దానం చేయాలంటే ఎవరు చేయవచ్చు అనే ప్రశ్న ఉంటుంది. రక్తదానం చేసే దాతలు ఆరోగ్యంగా ఉండాలనే విషయం గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో రక్తం దానం చేయవచ్చా లేదా అనేది చాలా మంది మహిళల్లో అనుమానం ఉంటుంది. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

- Advertisement -

పీరియడ్స్ సమయంలో రక్తదానం చేయవచ్చా?

- Advertisement -

పీరియడ్స్ సమయంలో మహిళలు రక్తదానం చేయలేరనేది అపోహ మాత్రమే అని నిపుణులు అంటున్నారు. పీరియడ్స్ సమయంలో మహిళలు రక్తదానం చేయవచ్చు. పీరియడ్స్ రావడం అంటే రక్తదానం చేయలేమని కాదు. అయితే, ఈ కాలంలో మహిళలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రక్తం దానం చేయవచ్చు. రక్తం దానం చేయాలనుకునే మహిళలు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.

పీరియడ్స్ సమయంలో రక్తదానం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

1) హిమోగ్లోబిన్ స్థాయి :

పీరియడ్స్ సమయంలో రక్తస్రావం కారణంగా హిమోగ్లోబిన్ స్థాయి తగ్గవచ్చు. రక్తదానం చేసే ముందు, మహిళలు హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవాలి. మహిళల్లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే, రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు.

2) ఐరన్ తీసుకోవడం :

ఐరన్ హిమోగ్లోబిన్‌లోని ప్రధాన భాగం. స్త్రీలు తమ పీరియడ్స్ సమయంలో కొంత ఇనుమును కోల్పోతారు. రక్తదానం చేయడం వలన శరీరంలోని ఐరన్ తగ్గిపోతుంది. ఐరన్ లోపాన్ని బచ్చలికూర, ఎర్ర మాంసం, కాయధాన్యాలు వంటి ఐరన్-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల పెంపొందించుకోవచ్చు.

3) ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి :

రక్తదానం చేసే ముందు ఆరోగ్యాన్ని పరిస్థితి సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం, తీవ్రమైన నొప్పి లేదా బాగా అలసిపోయినట్లు అనిపిస్తే, అప్పుడు రక్తదానం చేయవద్దు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News