Big Stories

Knee Pain Relief Foods: మోకాళ్ల నొప్పిని తట్టుకోలేకపోతున్నారా..? అయితే ఈ ఫుడ్‌ని డైట్‌లో చేర్చుకోండి.. నొప్పికి బై బై చెప్పండి!

Best Food for Knee Pain Relief and Joint Pain: ప్రస్తుత పరిస్థితిలో వయసుతో సంబంధం లేకుండా మొకాళ్ల నొప్పులు రావడం కామన్ అయిపోయింది. దీనికి కారణం జీవనశైలిలో మార్పులు రావడం, తినే ఆహారంలో మార్పులు, చెడు అలవాట్ల వల్ల మోకాళ్ల నొప్పులు ఏర్పడుతున్నాయి. గాయాలు, యాక్సిడెంట్స్ వల్ల నొప్పులు రావడం సహజం. కానీ మనం తినే పోషకాహార లోపం వలన నొప్పులు అనేవి ఏర్పడుతున్నాయి. అందుకే మనం తినే ఆహారంలో ముఖ్యంగా కొన్ని ఆహారాలు చేర్చడం ద్వారా ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

- Advertisement -

సాధారణంగా మోకాళ్లు, కీళ్లలో నొప్పి 40 ఏళ్లు పైబడినవారికి ఇలాంటి సమస్యలు వస్తాయి. కాని ప్రస్తుతం యువతలో కూడా ఈ సమస్య సర్వసాధారణంగా మారింది. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడమే ఇందుకు కారణం అంటున్నారు నిపుణులు.. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల మోకాళ్లు జామ్ అవడం మొదలవుతుంది. దీని కారణంగా మోకాళ్లు, తుంటి నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా మోకాళ్ల నొప్పులకు తినే పోషకాహారలోపంతో పాటు అధిక బరువు కూడా ఒక కారణం. అందువల్ల క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నడవడం వంటివి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మోకాళ్ల నొప్పులను తగ్గించే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందా..

- Advertisement -

కొవ్వు చేప..
ట్రౌట్, సాల్మన్, సార్డినెస్, మాకేరెల్, హెర్రింగ్, ట్యూనా, పిల్‌చార్డ్స్ వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉన్న చేపలను తీసుకోవడం వల్ల ఎముకలు ఇంకా కీళ్లను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. దీనితో పాటు వాపును కూడా తగ్గిస్తాయి.

Also Read: Types Of Rotis For Weight Loss: ఏ పిండితో చేసిన రొటీలు తింటే బరువు తగ్గుతారో తెలుసా.. ?

అల్లం..
అల్లం శోథ నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. దీనిని ఉపయోగించడం వల్ల మోకాళ్ల వాపును తగ్గించి, కీళ్లను బలోపేతం చేస్తాయి.

వాల్నట్..
ఎన్నో రకాల పోషకపదార్ధాలు ఉన్న వాల్ నట్స్ ప్రతిరోజు తినడం వల్ల మోచేతి, మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగా ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి.

కాలే..
కాలేలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.

బెర్రీలు..
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి యాంటీఆక్సిడెంట్-రిచ్ బెర్రీలు తినండం వల్ల కీళ్లలో మంటను కలిగించే ఆర్థరైటిస్‌ను నిరోధించడంలో సహాయపడతాయి.

Also Read: ఈ ఆహారాలు తింటున్నారా ? అయితే కిడ్నీ స్టోన్స్ గ్యారంటీ !

ఆలివ్ నూనె..
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఆలివ్ ఆయిల్ కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.

కారెట్..
క్యారెట్‌లో విటమిన్ ఎ, బి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది కీళ్లను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా రక్తాన్ని సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది కూడా.

పాలు మరియు పెరుగు..
పెరుగులో ప్రోబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. పాలలో కాల్షియం, కొవ్వులో కరిగే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మనం తినే ఆహారంలో ప్రతిరోజు ఇవి చేర్చడం ద్వారా ఎముకలు దృఢంగా మారతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News