Big Stories

Cooking Oil: వంటనూనెను ఆ చోట పెడుతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా

Cooking Oil: తరచూ వంట గదిలో స్టవ్ పక్కనే వంట సామానును పెట్టుకోవడం చాలా మందికి అలవాటు. ఎందుకంటే త్వరగా వంట పని పూర్తి కావాలంటే స్టవ్ కు దగ్గర్లోనే అన్ని వస్తువులు అందుబాటులో ఉండే చకచకా వంట పని పూర్తి చేయవచ్చని భావిస్తుంటారు. ఈ తరుణంలో స్టవ్ కు దగ్గర్లోనే పోపు దినుసుల బాక్స్, ఆయిల్ బాటిల్, మసాలాలు, పసుపు తదితర సామాన్లను అమర్చుకుంటారు. అయితే వారు స్టవ్ దగ్గర వాటిని నీటిగా అమర్చుకున్నా కూడా ఆ స్థలం మంచిది కాదని ఓ అధ్యయనంలో తేలింది. స్టవ్ కు దగ్గర్లో వంటసామానులో ముఖ్యమైన ఆయిల్ ను ఉంచడం ద్వారా ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

- Advertisement -

స్టవ్ పక్కన వంటనూనె పెట్టుకుని తరచూ ఉపయోగించడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయిల్ సీసాలను స్టవ్ వద్ద పెట్టుకోవడం వల్ల వేడికి నూనెలో ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతమవుతుందని అధ్యయనంలో తేలింది. అంతేకాదు పొరపాటున వాడిన తర్వాత నూనె బాటిల్ పై మూతను తెరిచి ఉంచడం వల్ల అందులో కొవ్వు పదార్థాలు క్షీణించి రుచి మారుతుంది. దీంతో నూనె నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతుందని పరిశోధకులు తెలిపారు.

- Advertisement -

ఈ నూనె వంటల్లో వాడడం వల్ల త్వరగా వృద్ధాప్యం బారిన పడే అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. అంతేకాదు దీనిని వాడిన వారిలో ఊబకాయం, జీర్ణ సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయని అన్నారు. అందువల్ల నూనె బాటిల్ ను స్టవ్ పక్కన అస్సలు ఉంచకూడదని అంటున్నారు. గాలి, వెలుతురు సరిగ్గా తగిలే చోట ఉంచి, దానిపై మూతను గట్టిగా పెట్టి ఉంచాలని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News