Big Stories

Relationship: లవ్ లైఫ్‌లో ఈ 3 సమస్యలు ఎదురవుతున్నాయా.. జాగ్రత్తగా ఉండకపోతే బాధపడాల్సి వస్తుంది

Relationship: ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కలిగే ఓ అందమైన అనుభూతి. కలిసి జీవించడానికి అన్నింటితో పాటు ప్రేమ అనేది చాలా ముఖ్యం. ఒకరి పట్ల మరొకరికి ప్రేమ, పరస్పర గౌరవం, అవగాహన కలిగి ఉండటం ఆరోగ్యకరమైన ప్రమాణం లాంటిది. కానీ ఈ రోజుల్లో, అది భర్త-భార్య లేదా ప్రేమికుడు-ప్రేమికురాలైనప్పటికీ, కొన్ని కారణాల వల్ల లేదా మరేదైనా కారణంగా చాలా సార్లు సంబంధం దెబ్బతింటుంది.

- Advertisement -

ఏ ప్రేమ సంబంధంలోనైనా జీవితం మెరుగ్గా ఉండాలి. అలా అనీ ఏ సంబంధం పరిపూర్ణంగా ఉంటుందని కూడా చెప్పలేం. కానీ ఆరోగ్యకరమైన సంబంధంలో చాలా సందర్భాలలో మంచి చెడు కంటే ఎక్కువగా ఉంటుంది. అలాంటి సంబంధంలో అభద్రత ఉండదు. మరోవైపు, విషపూరిత సంబంధంలో నిరంతరం ఒత్తిడి, అపార్థాలు, భావోద్వేగాలు అనుభవిస్తుంటారు. కొన్నిసార్లు చాలా ఒత్తిడికి కూడా గురవుతుంటారు. అయితే రిలేషన్ షిప్‌లో ఎటువంటి కారణాల పట్ల జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ప్రేమ

లవ్ అనేది నార్సిసిస్టిక్ లేదా బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న వ్యక్తులలో తరచుగా కనిపించే ప్రవర్తన. ప్రేమ జీవితంలో మొదట చాలా ఉత్సాహంగా ఉండవచ్చు. అంటే భాగస్వామి మీతో ఉండటానికి చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. కానీ దాని తర్వాత కొన్ని సమయాలలో వచ్చే విషయాలు భిన్నంగా ఉంటాయి. దీంతో అకస్మాత్తుగా ఎప్పుడో ఒకసారి గొడవ జరుగుతుంది. దీంతో పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. అందువల్ల ఏ వ్యక్తులపై కూడా మితిమీరిన ప్రేమ పెట్టుకోవడం మంచిది కాదు.

ఒత్తిడి

అన్ని సంబంధాలలో ఏదో ఒక సమయంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ నిరంతరం ఒత్తిడిని అనుభవిస్తే, అది జఅవితంలో చాలా సమస్యలకు దారి తీస్తుంది. ఇలాంటి వాటిని ఇతరులతో చర్చించడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అందరు ఎదుటివారి అర్థం చేసుకోలేరు. అందువల్ల ఎదుటివారికి అన్ని విషయాలు చెప్పుకోవడం అంత మంచిది కాదు. భాగస్వామితో ఏర్పడే సమస్యలను వారితోనే పరిష్కరించుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

అబద్ధాలు

అబద్ధం జీవితంలో పెద్ద సమస్య లాంటిది. భాగస్వామి వద్ద ఏదో దాచడం, నమ్మకద్రోహం చేయడం వంటివి తర్వాత ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. చిన్నచిన్న అబద్ధాలు చెప్పినా కూడా భాగస్వామి పట్ల ప్రేమ, నమ్మకం తగ్గిపోతుంది. అంతేకాదు కొన్ని సార్లు అబద్ధాలు చెప్పడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News