Big Stories

AI in food & drug safety : ఫుడ్ అండ్ డ్రగ్స్ సేఫ్టీ విషయంలో ఏఐ కీ రోల్..

AI in food & drug safety

AI in food & drug safety : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అనేది ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలపై ప్రభావం చూపిస్తోంది. అందుకే మిగతా అడ్వాన్స్ టెక్నాలజీల పక్కన పెట్టి కేవలం ఏఐకు సంబంధించిన టెక్నాలజీలపైనే సంస్థలు దృష్టిపెట్టాయి. దీంతో పాటు రియల్ వరల్డ్ డేటా (ఆర్‌డబ్ల్యూడీ) విషయంలో కూడా మార్పులు చేయాలనుకుంటున్నాయి. అయితే ఇలాంటి టెక్నాలజీలను ఉపయోగకరంగా మార్చుకోవాలని గ్లోబల్ రెగ్యులేటర్లు అనుకుంటున్నట్టు సమాచారం.

- Advertisement -

ప్రస్తుతం పలు ప్రపంచ దేశాలు కలిసి యాన్యువల్ రెగ్యులేటరీ సైన్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఏఐను ఎలా అలవాటు చేసుకుంటున్నాయి. ఆ కోణంలో ఎలాంటి పరిశోధనలు చేస్తున్నాయి అనేదే ఈ సమావేశంలో చర్చించబడుతున్న ముఖ్యమైన అంశం. ఇప్పటికే ఈ విషయంపై అమెరికా, యూకే లాంటి దేశాలు తమ అభిప్రాయాలను వినిపించాయి. ముఖ్యంగా ఫుడ్ అండ్ డ్రగ్ సెక్యూరిటీ విషయంలో ఏఐ అనేది ఆయా దేశాలకు ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని చర్చించారు.

- Advertisement -

ఏఐతో పాటు ఆర్‌డబ్ల్యూడీ కూడా రెగ్యులేటరీ సైన్స్‌ను ఏ విధంగా మార్చేశాయి అనేదానిపై పరిశోధకులు క్షుణ్ణంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ రెండు రెగ్యులేటరీ సైన్స్‌తో చేతులు కలిపితేనే ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ విషయంలో మరింత మెరుగ్గా పనిచేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. మామూలుగా ఒక డ్రగ్‌ను తయారు చేయాలంటే ప్లానింగ్ దగ్గర నుండి తయారీ వరకు ఎన్నో విషయాలను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. దానికి ఎన్నో సంవత్సరాలు సమయంతో పాటు ఎంతో ఖర్చు కూడా అవుతుంది. అయితే ఏఐ, ఆర్‌డబ్ల్యూడీ.. డ్రగ్ సేఫ్టీ విషయంలో చొరవ తీసుకుంటే దాని పని సులువు అవుతుందని పరిశోధకులు చెప్తున్నారు.

ఇప్పటికే రెగ్యులేటరీ సైన్స్‌తో కలిసిన ఏఐ, ఆర్‌డబ్ల్యూడీ పలు ప్రపంచ దేశాల్లోని ఫుడ్ అండ్ డ్రగ్స్ సేఫ్టీ విషయంలో పలు మార్పులకు కారణమయ్యాయి. కానీ చాలావరకు ప్రపంచ దేశాలు మాత్రం డ్రగ్స్ సేఫ్టీ విషయంలో ఏఐ మెరుగ్గా పనిచేస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఏఐ ఎలా పనిచేయాలి అనే విధానాన్ని రెగ్యులేటరీ సైన్స్ సాయంతో డిజైన్ చేస్తే రిజల్ట్ మరింత మెరుగ్గా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఇలా ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ విషయంలో ఏఐ అనేది ప్రపంచాన్ని శాసిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News