Big Stories

Foods for Memory Power: మీ జ్ఞాపకశక్తితో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించే 5 ఆహారాలు ఇవే..

Foods to Improve Memory Power and Health: మెదడు మన శరీరంలో అత్యంత క్లిష్టమైన అవయవం. నిరంతరం మెదడు పని చేస్తూనే ఉంటుంది. అందుకే మనం శారీర ఆరోగ్యంపై శ్రద్ధ చూపడంతోపాటు మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అందుకోసం ప్రతి ఒక్కరు డైట్ లో కొన్ని సూపర్ ఫుడ్స్ చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి మెదడు పనితీరును అంతేకాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

- Advertisement -

కొవ్వు ఆమ్లాలు మెదడు అభివృద్ధితో పాటు కణాల నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒమేగా -3 అధికంగా ఉండే ఆహారం మెదడు చురుకుగా పని చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. సాల్మన్, ట్యూనా చేపలు, స్ట్రాబెరీ,బ్లూబెర్రీ, మొలకెత్తిన విత్తనాలు, టమాటో, కాఫీలు మీ జ్ఞాపకశక్తి పెంచుతాయి.

- Advertisement -

పోషకాలతో కూడిన ఆహారం తినడం వల్ల జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. అంతే కాకుండా మేధస్సుకు పదును పెట్టడంలో ఇది సహాయపడుతుంది. సాల్మన్, ట్యూనా, కార్డ్ వంటి చేపలు ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు జ్ఞాపక శక్తిని పదును పెట్టడంలోనూ అంతేకాకుండా మానసిక స్థితిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు మన శరీరం ఉత్పత్తి చేయదు. కానీ ఇవి చేపలు తినడం వల్ల వస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడుకు ముఖ్యమైన పోషకాలు.

Also Read: Kidney Stones: ఈ ఆహారాలు తింటున్నారా ? అయితే కిడ్నీ స్టోన్స్ గ్యారంటీ !

గ్రీన్ లీఫీ వెజిటెబుల్స్:
గ్రీన్ లీఫీ వెజిటెబుల్స్ లో విటమిన్స్, ఐరన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని పోషకాల లోపాన్ని భర్తీ చేస్తాయి. బచ్చలికూర, బ్రోకలీ, ఆకుకూరలు ఎరుపు రంగు కూరగాయలు జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటి వినియోగం మెదడు చురుకుగా పనిచేస్తుంది.

గుడ్లు:
గుడ్లు తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ప్రతి రోజు కనీసం ఒక గుడ్డు తినడం అవసరం. గుడ్లులో పుష్కలంగా ప్రోటీన్లు ఉంటాయి. ఇందులో ఫోలేట్, కోలిన్ విటమిన్లు అధికంగా ఉంటాయి. కోలిన్ మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగకగపడుతుంది.

గింజలు, నట్స్:
గింజలు, నట్స్, వాల్ నట్స్, ఎండు ద్రాక్షలు, బాదంలో కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఈ ఆహారాలను రోజూ నానబెట్టుకుని తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అంతేకాకుండా గుమ్మడి గింజలు, అనేక రకాల విత్తనాలు తినడం వల్ల మెదడు పదును పెరుగుతుంది. మీ జ్ఞాపకశక్తిని పెరగడానికి ఇవి ఉత్తమమైన ఆహారాలు.

Also Read: Benefits of Multani Mitti Hair Packs: ఇలా ట్రై చేయండి.. ముఖంతోపాటు జుట్టు కూడా మెరిసిపోతుంది

సిట్రస్ పండ్లు:
బత్తాయి, నారింజ, దానిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు రుచికి పుల్లగా ఉంటాయి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అంతేకాకుండా మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది.

ధాన్యాలు:
వేరు శనగలు, శనగలు, వంటివి గ్లైసెమిక్ కలిగివున్న పప్పుధాన్యాలు. ఇవి శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి వీటిని పిల్లలకు తరచుగా స్నాక్స్ రూపంలో ఇస్తే వారి మెమరీ పవర్ పెరుగుతుంది. పిల్లలకు తరచుగా స్నాక్స్ రూపంలో వీటిని ఇవ్వడం వల్ల వారి ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరగడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఫలితంగా మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది.

Also Read: బరువు పెరుగుతున్నామని బ్రేక్‌ఫాస్ట్ తినడం మానేస్తున్నారా ?

ఓట్స్:
ఫైబర్ కంటెంట్ ఓట్స్ లో అధికంగా ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా ఇవి శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఓట్స్ తింటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. పిల్లలు ఏకాగ్రతతో పనిచేయడానికి అంతే కాకుండా జ్ఞాపకశక్తి పెరగడానికి ఇవి ఉపయోగపడతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News