Big Stories

Stages of Asthma: ఆస్తమాలో 4 దశలు.. ఇందులో ఏది అత్యంత ప్రాణాంతకమో తెలుసా..?

Stages of Asthma: ఆస్తమా అనేది ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. ఆస్తమా కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బిగుతు, శ్లేష్మం వంటి సమస్యలు ఉంటాయి. ఆస్తమాతో బాధపడేవారికి ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగుతుంది. ఆస్తమా బారిన పడిన వారిలో శ్వాసకోశంలో వాపు, సంకోచం ఉంటుంది. అంతేకాదు ఉబ్బసం ఉన్న రోగులు శ్వాస తీసుకోవడంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఆస్తమా అటాక్‌ వచ్చినప్పుడు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఉంటాయని, ఈ సమస్యతో బాధపడే వారు తరచూ ఇన్హేలర్ వాడాల్సి ఉంటుంది. ఈ వ్యాధి ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు. అయితే ఆస్తమాలో దశలు ఉంటాయని చాలా మందికి తెలియదు. ఇందులో 4 దశలు ఉంటాయి.

- Advertisement -

గాలి, కాలుష్యం, దుమ్ము, నేల వంటి వివిధ కారణాల వల్ల ఆస్తమా సమస్య పెరుగుతుంది. ఆస్తమా రోగులకు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది కాలక్రమేణా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి. అందులో ఏది ప్రమాదకరమైన దశనో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ఆస్తమా దశలు:-

1. సాధరణమైన ఆస్తమా

ఆస్తమా మొదటి దశలో అడపాదడపా అంటే సాధారణంగా ఉంటుంది. మొదటి దశలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. 2-4 రోజులలో లక్షణాలను చూపుతుంది. చాలా వరకు ఈ దశలో లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. రాత్రి నిద్రిస్తున్నప్పుడు మరింత ఇబ్బంది ఉండవచ్చు. ఈ దశలోని ఆస్తమాలో, ఊపిరితిత్తుల పనితీరు సామర్థ్యం 80-90 శాతంగా మారుతుంది.

Also Read: Monsoon Health Care: వర్షాకాలం వచ్చేసింది.. ఈ వ్యాధుల పట్ల తస్మాత్ జాగ్రత్త..

2. తేలికపాటి ఆస్తమా

తేలికపాటి ఆస్తమా రెండవ దశ. ఈ దశలో, రోగులలో తీవ్రమైన లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. వారానికి ఒకసారి ఆస్తమా సమస్య ఇబ్బంది పెడుతుంది. రెండవ దశలో లక్షణాలు 7-10 రోజుల వరకు ఉంటాయి. ఇన్హేలర్ వారానికి రెండు నుండి మూడు సార్లు ఉపయోగించాలి.

3. మితమైన ఆస్తమా

మితమైన ఆస్తమా అనేది తీవ్రమైన పరిస్థితి. ఈ స్థితిలో రోగులకు చాలా రోజులు లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాల కారణంగా రాత్రి నిద్రపోవడంలో ఇబ్బంది పడతారు. ఈ దశలో రోజువారీ పనులలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Also Read: Besan Flour for Skin : శనగపిండితో నలుగు.. ఇలా వాడితే మెరిసే చర్మం మీ సొంతం

4. తీవ్రమైన ఆస్తమా

చివరిది కానీ అత్యంత ప్రమాదకరమైనది. తీవ్రమైన ఆస్తమా సమయంలో ఎక్కువ సార్లు ఈ సమస్య ఎదురవుతుంది. దీనితో పాటు, రాత్రంతా దగ్గు వస్తుంది, దీని కారణంగా నిద్ర పట్టదు. ఇందులో, ఊపిరితిత్తులు తీవ్రంగా ప్రభావితమవుతాయి. వాటి సామర్థ్యం 60 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితులలో, రోగులకు ఇన్హేలర్ చాలా అవసరం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News