BigTV English

Vishwak Sen: అర్జున్‌తో వివాదంపై విశ్వ‌క్ సేన్ రియాక్ష‌న్‌

Vishwak Sen: అర్జున్‌తో వివాదంపై విశ్వ‌క్ సేన్ రియాక్ష‌న్‌

Vishwak Sen: సీనియ‌ర్ న‌టుడు యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ మ‌ధ్య ఓ వివాదం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. వారిద్ద‌రూ క‌లిసి సినిమా చేద్దామ‌ని అనుకున్నారు. అర్జున్ కుమార్తె ఐశ్వ‌ర్య అర్జున్‌ని తెలుగులోకి ఇంట్ర‌డ్యూస్ చేయ‌టానికి కూడా అర్జున్ సిద్ధ‌మ‌య్యారు. మూవీ లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది కూడా. అయితే ఏమైందో ఏమో తెలియ‌దు. అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విశ్వ‌క్ సేన్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అనుకున్న స‌మ‌యానికి షూటింగ్‌కి రాక‌పోవ‌టం, షెడ్యూల్స్‌ను వాయిదాల మీద వాయిదాలు వేస్తుండ‌టంతో అర్జున్ విసుగొచ్చి విశ్వ‌క్ సేన్‌పై మాట‌ల‌తో విరుచుకుప‌డ్డారు.


ఓ సీనియ‌ర్ న‌టుడైన త‌న‌కు విశ్వ‌క్ సేన్ చుక్క‌లు చూపించార‌ని అర్జున్ త‌న ప్రెస్‌మీట్‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయనతో తాను సినిమా చేయటం లేదని అర్జున్ తెలిపారు. అయితే అర్జున్ ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌లేద‌ని, త‌న‌కు ఫ్రీడ‌మ్ ఇవ్వ‌లేద‌ని విశ్వ‌క్ సేన్‌.. అర్జున్ వ్యాఖ్య‌ల‌ను తిప్పికొట్టారు. ఇది జ‌రిగి చాలా రోజులు అయ్యింది. అయితే ఇప్పుడు మాస్ కా దాస్ సినిమా రిలీజ్ స‌మ‌యంలో అదే ప్ర‌శ్న‌ను విశ్వ‌క్ సేన్‌ను మ‌రోసారి మీడియా ప్ర‌శ్నించింది. మీకు రెమ్యూన‌రేష‌న్ చెల్లించిన‌ప్ప‌టికీ మీరు అర్జున్ సినిమా షూటింగ్‌లో పాల్గొన‌లేద‌నే వార్త‌లు వినిపించాయి. మ‌రి మీరేమంటారు అని అడిగారు.

అడిగిన ప్ర‌శ్న‌కు జ‌వాబు చెప్ప‌టం ఇష్టం లేదో ఏమో కానీ.. ‘అదంతా గతం. చాలా మందిపై ఉన్న గౌర‌వంతో నేను ఆవిష‌యంపై మాట్లాద‌లుచుకోలేదు’ అని విశ్వక్ సమాధానం చెప్పారు. ఈయ‌న హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా దాస్ మా ధ‌మ్కీ. మార్చి 22న మూవీ రిలీజ్ కానుంది. విశ్వక్ సేన్.. ద్విపాత్రాభినయం చేశారు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.


ఆస్కార్ వేదికపై గునీత్ మోంగాకు చేదు అనుభవం.. అసలేం జరిగిందంటే?

for more updates follow this link:-bigtv

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×