E-Paper
Advertisement

Virupaksha Teaser: ‘విరూపాక్ష’ టీజర్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్

Virupaksha Teaser: ‘విరూపాక్ష’ టీజర్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్
Advertisement

Virupaksha Teaser :సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష‌’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై బాపినీడు.బి సమర్పణలో ప్రముఖ నిర్మాత బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో విరూపాక్ష చిత్రాన్ని ఏప్రిల్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేయ‌టానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా గురువారం విరూపాక్ష సినిమా టీజ‌ర్‌ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విడుద‌ల చేశారు. విరూపాక్ష

టీజ‌ర్ గ‌మ‌నిస్తే.. ఓ ప్రాంతంలోని ప్ర‌జ‌లు విచిత్ర‌మైన స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. ప్ర‌శ్న ఎక్క‌డ మొద‌లైందో స‌మాధానం అక్క‌డే వెత‌కాల‌ని, ఏదో పుస‌క్తాన్ని హీరో చ‌దువుతుండ‌టం, ప్ర‌మాదాన్ని దాట‌డానికే నా ప్రయాణం అని హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ చెప్ప‌టం స‌న్నివేశాలు … ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూప‌టానికి మన క‌థానాయ‌కుడు సాయిధ‌రమ్ తేజ్ ఏం చేశార‌నేదే అస‌లు క‌థ అని విరూపాక్ష సినిమా అని టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. శ్యామ్ ద‌త్ సైనుద్దీన్, అజ‌నీష్ లోక్‌నాథ్ బీజీఎం సినిమాపై ఆస‌క్తిని రెట్టింపు చేస్తున్నాయి. టీజ‌ర్ చివ‌ర‌లో ఓ అమ్మాయి అలా గాలిలో ఎగురుతూ క‌న‌ప‌డుతున్న స‌న్నివేశంలో ఆడియెన్స్‌లో తెలియ‌ని ఓ భ‌యాన్ని క‌లిగిస్తోంది.

Advertisement

విరూపాక్ష‌తో సాయిధ‌ర‌మ్ పాన్ ఇండియా లెవ‌ల్లో త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకోవ‌టానికి రెడీ అవుతున్నారు. అలాగే యాక్సిడెండ్ త‌ర్వాత ఈ మెగా క్యాంప్ హీరో న‌టిస్తోన్న తొలి చిత్రం కూడా ఇదే. సాయిధ‌ర‌మ్ తేజ్ లుక్ కూడా చాలా డిఫ‌రెంట్‌గా అనిపిస్తుంది.

OTT: ఓటీటీలోకి ఒకే రోజు 10 సినిమాలు.. సినీ లవర్స్‌కు పండుగే..

Advertisement

Taraka Ratna: బాధనంతా నీలోనే దాచి.. అలేఖ్యరెడ్డి ఎమోషనల్ పోస్ట్..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×