Big Stories

UK General Election Results: యూకే పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం

UK General Election Results(Today’s international news): యూకే పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చాయి. ఈ మేరకు రిషి సునాక్ఓ టమిని అంగీకరించారు. అనంతరం లేబర్ పార్టీ నేత స్టార్మర్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

యూకే పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. ఆ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ‘ ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేస్తున్నా. అధికారం శాంతియుతంగా మారుతుంది. దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ నమ్మకం కలిగిస్తుంది.’ అని సునాక్ ఎక్స్ వేదికగా స్పందించారు.

- Advertisement -

రిచ్‌మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్‌లోని తన మద్దతుదారులను క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా అంటూ సునాక్ కోరారు. కాగా, ఈ ఎన్నికల్లో ఇప్పటికే లేబర్ పార్టీ 388 స్థానాలు దక్కించుకోగా.. కన్జర్వేటివ్ పార్టీకి 96 స్థానాలు, లిబరల్ డెమోక్రట్స్ పార్టీ 39 స్థానాలు, స్కాటిష్ నేషనల్ పార్టీ 4 స్థానాలు, రిఫార్మ్ యూకే పార్టీ 4 స్థానాలు, ఇతరులు 18 స్థానాల్లో గెలుపొందారు.

ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా మొత్తం 650 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. అయితే అధికారం చేపట్టేందుకు 326 సీట్లలో గెలుపొందాల్సి ఉంటుంది. బ్రిటన్ కాలమానం ప్రకారం.. నిన్న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. మొత్తం 4.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. గత ఎన్నికలతో పోల్చితే తక్కువ పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది కేవలం 67 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

అంతకుముందు లేబర్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా ఉన్న కీర్ స్టార్మర్..ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయనే సంకేతాలు వెలువడిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మార్పు చెందిన లేబర్ పార్టీపై నమ్మకం ఉంచిన కార్యకర్తలకు, ఓటర్లకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News