Big Stories

Tomato Ketchup: టమాటా కెచప్‌తో కలిగే దుష్ప్రభావాలు ఇవే!

Tomato Ketchup:టమాటా కెచప్‌లు చాలామంది ఫాస్ట్ ఫుడ్‌లో బేకరీ ఐటమ్స్‌లో వేసుకొని తింటుంటారు. కెచప్‌ ఎక్కువగా తినడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. చాలా దుష్ప్రభావాలు కూడా ఉంటాయి.

- Advertisement -

అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. టమాటా కెచప్‌ను ఎక్కువగా తింటే బరువు భారీగా పెరిగి స్థూలకాయం సమస్య వస్తుంది. ఎందుకంటే ఈ కెచప్‌లో చక్కెర రిజర్వేటివ్స్ ఎక్కువ శాతం ఉంటాయి. క్యాలరీలు కూడా అదనంగానే ఉంటాయి. అందువల్ల కెచప్‌లు తింటే బరువు పెరుగుతారు. టమోటా కెచప్‌లు తరచూ తినడం వల్ల యాసిడిటీ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణశయంలో అసౌకర్యం కలుగుతాయి. అందువల్ల కెచప్ వాడకాన్ని తగ్గించాలి. లేదా పూర్తిగా మానివేయాలని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

ఎక్కువగా తినడం వల్ల కొందరికి అలర్జీలు వస్తాయి. ఈ కెచప్‌లో సిస్టమైన్ అధికశాతంలో ఉంటుంది. అది అలర్జీలను కలుగజేస్తుంది. ఎలర్జీలు ఒకసారి వస్తే తగ్గటం చాలా వరకు కష్టం కాబట్టి టమాటా కెచప్‌ వాడకపోవడమే ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News