Big Stories

High court to give verdict on KCR’s Plea: కేసీఆర్ పిటిషన్‌పై రేపు హైకోర్టు తీర్పు!.. సర్వత్రా ఉత్కంఠ

Telangana high court to give verdict on KCR’s Plea: విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రంలో రాజకీయ దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రాష్ట్ర హైకోర్టు జూన్ 28న విచారణ ప్రారంభించింది. విచారణ సందర్భంగా.. ప్రభుత్వం, కేసీఆర్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వీరి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం ఆ తీర్పును వెలువరించనున్నది.

- Advertisement -

అయితే, కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం ఎలాంటి తీర్పును వెలువరిస్తుందనే ఉత్కంఠ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్నది. తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా లేదా కేసీఆర్ కా..? అంటూ చర్చించుకుంటున్నారు. ఈ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే కేసీఆర్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లేనంటూ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరుగా సాగుతోంది. మరి కేసీఆర్ వేసిన పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి తీర్పును ఇయ్యబోతుందో వేచి చూడాలి.

- Advertisement -

ఇదిలా ఉంటే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందంటూ సంబంధిత మంత్రి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం.. ఒక స్పెషల్ జడ్జితో కూడిన కమిషన్ ను నియమించింది. ఇందుకు సంబంధించి ఆ కమిషన్ వెంటనే విచారణ ప్రారంభించింది. అందులో భాగంగా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతోపాటు ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నది.

Also Read: విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి డీఎస్: సీఎం రేవంత్ రెడ్డి

అయితే, నోటీసులపై రెస్పాండైన కేసీఆర్.. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలతో కూడిన లేఖను రాశారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ అందులో పేర్కొన్నారు. తమ హయాంలో విద్యుత్ విషయంలో గణనీయ మార్పు చూపించామన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందించామన్నారు. ఆ తరువాత కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఇటు కమిషన్ కూడా కేసీఆర్ కు మరోసారి నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News