Big Stories

Sky Canvas:- స్కై కాన్వాస్ ప్రాజెక్ట్.. కృత్రిమంగా తోకచుక్కలు..

Sky Canvas:- ఈరోజుల్లో ప్రకృతి అందించే ప్రతీదానికి ఆర్టిఫిషియల్‌గా ఒక డూప్లికేట్ ఏర్పాటవుతోంది. మనుషులు నేచురల్‌గా ఎంజాయ్ చేసే ప్రతీదానికి కృత్రిమంగా మరొక ఆప్షన్ అందుబాటులో ఉంటోంది. తాజాగా అలాంటి మరొక అద్భుతం చేయడానికే శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఏకంగా తోకచుక్కనే కృత్రిమంగా తయారు చేస్తామంటున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. కొన్నేళ్లలో ఈ ప్రయోగాన్ని సక్సెస్ చూసి చూపిస్తామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

- Advertisement -

తోకచుక్కను చూసి ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని నమ్ముతారు కొందరు. మరికొందరు అలాంటివి ఏవి నమ్మకపోయినా మెటియోర్ జల్లులను ఇష్టపడతారు. స్టార్‌గేజింగ్ చేస్తూ మెటియోర్ జల్లులను చూడడం చాలామందికి ఇష్టమైన హాబీ. అయితే ఈ మెటియోర్ జల్లులను ఆర్టిఫిషియల్ తోకచుక్కలతో క్రియేట్ చేయడానికి జపాన్ శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఆర్టిఫిషియల్ మెటియోర్ జల్లులను కురిపించడం కోసం కొన్ని శాటిలైట్లను వారు అంతరిక్షంలోకి పంపించనున్నారు.

- Advertisement -

2025లో జపాన్ చేసే శాటిలైట్ల లాంచ్.. ఆర్టిఫిషియల్ మెటియోర్ జల్లులకు కారణమవుతుందని ఈ దేశ మీడియా చెప్పుకుంటోంది. టోక్కోకు చెందిన కంపెనీ.. ఈ శాటిలైట్లను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రపంచంలోనే మనిషి తయారు చేసిన మొట్టమొదటి మెటియోర్ షవర్‌గా రికార్డ్ సాధించనుంది. ప్రపంచ దేశాల్లో మనిషి ఎక్కడున్న ఈ మెటియోర్ షవర్‌ను చూసేలాగా వారు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ‘స్కై కాన్వాస్’ అని పేరు కూడా పెట్టారు.

ఈ స్కై కాన్వాస్ అనేది ముఖ్యంగా ఆట్మాస్పియర్‌కు చెందిన మూడో లేయర్ అయిన మెసోస్పియర్‌ను స్టడీ చేయడానికి తయారు చేయబడుతోంది. ఇప్పటివరకు మెసోస్పియర్‌పై ఎవరూ పరిశోధనలు చేయలేకపోయారు. ఎందుకంటే ఇది శాటిలైట్ల తిరిగే అంత ఎత్తులో ఉండదు. ఎయిర్‌క్రాఫ్ట్ చేరుకునే అంత కింద ఉండదు. అందుకే దీనిని ప్రత్యేకంగా స్టడీ చేయడం కోసం స్కై కాన్వాస్ సిద్ధమవుతోంది. 2020లోనే ఈ ప్రాజెక్ట్ లాంచ్ జరగాల్సి ఉంది కానీ పలు సాంకేతిక కారణాలు వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

స్కై కాన్వాస్ అనేది సెకనుకు 8 కిలోమీటర్ల వేగంతో పెల్లెట్స్‌ను ఆకాశంలోకి వదులుతుంది. దీని ద్వారా భూమిపైనుండి చూసేవారికి అది మెటియోర్ షవర్‌లాగా కనిపిస్తుంది. మామూలుగా మెటియోర్ షవర్ అనేది ఏదైనా ఆస్ట్రాయిడ్ లేదా కామెట్.. భూమి నుండి పాస్ అయినప్పుడు జరుగుతుంది. మెటియోర్ అనేవి రాళ్లు లేదా ఐస్ ముక్కలు అని నాసా చెప్తోంది. ప్రతీ ఏడాది దాదాపు 30 మెటియోర్ షవర్లను మనుషులు చూడగలుగుతారు. అందులో కొన్ని చాలా అరుదుగా కూడా జరుగుతాయి. ఇప్పుడు స్కై కాన్వాస్ ప్రాజెక్ట్ ద్వారా మనుషులు వాటిని తరచుగా చూడవచ్చని భావిస్తున్నారు.

వాతావరణంలో మార్పులు.. నాసా కొత్త స్ట్రాటజీ..

for more updates follow this link:-Bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News