Big Stories

NASA :వాతావరణంలో మార్పులు.. నాసా కొత్త స్ట్రాటజీ..

NASA

NASA : కేవలం అంతరిక్షాన్ని మాత్రమే కాదు.. ఇతర గ్రహాలను దాంతో పాటు భూగ్రహాన్ని స్టడీ చేయడానికి కూడా స్పేస్ ఏజెన్సీలు కష్టపడుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటి నాసా. ప్రస్తుతం నాసా.. భూగ్రహాన్ని మానవాళికి ఆరోగ్యవంతమైన వాతావరణంగా ఎలా మార్చాలి అన్న విషయంపై పరిశోధనలు చేస్తోంది. దానికోసమే కొత్త స్ట్రాటజీని సిద్ధం చేసుకుంది. ఇటీవల ఈ స్ట్రాటజీని నాసా స్వయంగా విడుదల చేసింది.

- Advertisement -

1960ల్లో టిరోస్ శాటిలైట్లు లాంచ్ అయిన దగ్గర నుండి అంతరిక్షం నుండి భూమిపై స్టడీలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఎన్నో శాటిలైట్లు ప్రస్తుతం అంతరిక్షంలో తిరుగుతూ భూమిని గమనిస్తూ ఉన్నాయి. ఇన్నాళ్లు భూమిపై చేసిన పరీక్షల ద్వారా ఇది ఒక ఇంటర్‌కనెక్టెడ్ సిస్టమ్ అని స్పష్టమయ్యింది. లోకల్‌గా జరిగే విషయాలు ప్రపంచంపై, ప్రపంచంలో జరుగుతున్న మార్పులు లోకల్‌గా.. ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం భూమిపై జరుగుతున్న మార్పులను బట్టి దీనికి ఒక స్ట్రాటజీ కావాలని నాసా నిర్ణయించుకుంది. అందుకే ‘అడ్వాన్సింగ్ నాసా క్లైమెట్ స్ట్రాటజీ’ని విడుదల చేసింది.

- Advertisement -

గత తొమ్మిదేళ్లలో నమోదయిన ఉష్ణోగ్రతలు ఇంతకు మందెప్పుడూ రికార్డ్ అవ్వలేదు. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు కూడా. అందుకే భూమిని.. వాతావరణ మార్పుల నుండి, వేడి నుండి ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నాసా విడుదల చేసిన క్లైమెట్ స్ట్రాటజీలో అందరూ వాతావరణ మార్పులను అదుపు చేయడానికి ఎలా పాటుపడాలి అనేది వివరించింది. ఒక కమిట్మెంట్‌తోనే ఇదంతా సాధ్యమవుతుందని నాసా అంటోంది.

వాతావరణంతో పాటు భూమి సిస్టమ్ అనేది కూడా మరుతూ వస్తోంది. ఇది కేవలం సైన్స్‌పైనే కాదు.. ఎన్నో ఇతర అంశాలపై కూడా ప్రభావం చూపిస్తోంది. నాసా తయారు చేసిన స్ట్రాటజీ.. ప్రపంచ దేశాల ఏజెన్సీల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పరచి వాతావరణ మార్పుల కోసం ఎలా పాటుపడాలో వివరిస్తుంది. అంతే కాకుండా దీని ద్వారా ప్రజలకు కూడా మంచి జరిగేలా చూస్తుంది. ఈ స్ట్రాటజీని ముఖ్యంగా నాలుగు ముఖ్య లక్ష్యాలతో ముందుకు నడిపించనుంది నాసా.

ఇన్నోవేట్, ఇన్ఫార్మ్, ఇన్స్‌పైర్, పార్ట్‌నర్.. ఈ నాలుగు లక్ష్యాలను సాధించడం కోసమే నాసా క్లైమెట్ స్ట్రాటజీ పనిచేస్తుంది. భూమి గురించి తెలుసుకోవడానికి ఇప్పటివరకు ఉన్న మిషన్స్ కాకుండా కొత్త కొత్త మిషన్లను, ఐడియాలను కనిపెట్టడమే ఇన్నోవేట్ లక్ష్యానికి అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు వాతావరణ మార్పుల గురించి సమాచారాన్ని షేర్ చేసుకోవడమే ఇన్ఫార్మ్. అందరూ వాతావరణ మార్పుల విషయంలో కలిసి పనిచేసేలా చేయడమే నాసా మిషన్ ఇన్‌స్పైర్. ఇలా ప్రపంచ దేశాలన్నీ కలిసి వాతావరణ మార్పుల విషయంలో పనిచేయాలని నాసా కోరుకుంటోంది.

follow this link for more updates : BIGTV

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News