The Crow:- కాకి శనైశ్చరుని వాహనం. భోజనం చేసే ముందు మనం అన్నం దేవునికి నివేదనం చేసి కాకికి పెట్టమని పెద్దలు చెబుతుంటారు. కాకి శనీశ్వరుని వాహనం అంతే కాదు మన పితృదేవతలు కూడా కాకి స్వరూపంలో మనచుట్టూ తిరుగుతూ ఉంటారట. కాకి యమలోక ద్వారం ముందు యమునికి దూతగా వ్యవరిస్తూ ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
కాకికి అన్నం పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన పితరులు సంతృప్తి చెంది కింద ఉన్న కుటుంబ సభ్యులి ఆశీర్వాదాలు ఇస్తారు. . కాకి శ్రాద్ధ దినమందు అన్నము ముట్టకపోతే మన పితరులకు మనపై ఆగ్రహం లేక కోపం వుందనేది పెద్దల మాట. అందువల్లే కాకి అన్నము ముట్టే వరకు తాపత్రయపడి ముట్టిన తర్వాత భోజనం చేస్తారు. ఈమధ్య ఉన్న బలగం సినిమా క్లైమాక్స్ సీన్ అంతా కాకి చుట్టూ తిరగడాన్ని మనం గమనించవచ్చు.
గయలో మనం పిదాడులను వేసే శిలకు పేరు కాక శిల అని పేరు ఆ శిలపై పిండాలు పితరులను ప్రార్థిస్తే కాకి తానొక్కటే భుజించకుండా కావు కావు మని కేకలు వేసి తన వారినందరినీ చేర్చుకొని అన్నం తింటుంది. అంత గొప్ప వివేకము ఉన్న ప్రాణి కాకి. గరుడ పురాణం తదితర పురాణములు మన పితరులు కాక రూపములో భూలోక సంచారం చేస్తూ ఉంటారు. మనము సమర్పించే అన్నము తింటూ మనలను ఆశీర్వదిస్తారు.
కాకి రూపంలో పితృదేవతలు ఆహారాన్ని స్వీకరించడానికి వస్తారు కాబట్టి, పితృదేవతలు మనని నిత్యమూ పలకరిస్తూ ఉంటారని భావించాలి.కాకికి అన్నము పెట్టడం వల్ల కుటుంబం అన్యోన్యత సఖ్యత కలిగి ఉంటారు. శని దేవత వాహనం కాకి అందుకే మనకు శని అనుగ్రహం కూడా కలుగును. కాకి ఎవ్వరికీ హాని చేయని ప్రాణి. మన చుట్టూ ఉండే అశుద్దములను తొలగించటంలో మనకు సహాయ పడుతుంది కాబట్టి కాకికి అన్నం పెట్టడం అనే ఆచారం కూడా మన పెద్దలు ఏర్పాటు చేసి ఉండొచ్చు. .
ఏటా ఆదిత్యుని కళ్యాణోత్సవం ఎందుకంటే…
for more updates follow this link:-Bigtv