BigTV English

Arasavalli : ఏటా ఆదిత్యుని కళ్యాణోత్సవం ఎందుకంటే…

Arasavalli : ఏటా ఆదిత్యుని కళ్యాణోత్సవం ఎందుకంటే…
Arasavalli

Arasavalli : శ్రీకాకుళంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఏడాది పొడుగునా భక్తుల రద్దీ ఉంటున్నప్పటికీ ప్రత్యేకంగా కొన్ని రోజుల్లో స్వామివారి ఆలయం ఉత్సవాలు, జాతరతో కిటకిట లాడుతుంది. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఏప్రిల్ 1వ తేదీ శనివారం చైత్ర శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని రాత్రి 9 గంటలకు ఆదిత్యుని వార్షిక కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కళ్యాణ సేవలో పాల్గొనాలనుకునే భక్తులు ఆలయ కార్యాలయంలో రూ. 500 చెల్లించి కళ్యాణం లో పాల్గొనవచ్చు


వెలుగుల రేడు సూర్యదేవుని వార్షిక కళ్యాణోత్సవం అరసవల్లి పుణ్యక్షేత్రంలో రథసప్తమి, తెప్పోత్సవం తరువాత అంతటి ప్రధాన్యం కలిగిన ఈ వార్షిక కళ్యాణోత్సవాలకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆరాధ్య దైవంగా ఇక్కడి సూర్య భగవానున్ని పూజిస్తారు. ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ సూర్య నారాయణ స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా రెండు పర్యాయాలు సూర్యోదయాన సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు పాదాలను తాకేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ దృశ్యం భక్తుల్లో ఆనంద పారవశ్యాన్ని, ఆధ్యాత్మికతను నింపుతుంది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు

ఆదిత్య హృదయంలో దాదాపు ముప్పై శ్లోకాలుంటాయి. ఇందులో ఇరవై రెండో శ్లోకం నుంచి ఇరవై ఏడో శ్లోకం వరకు ఆదిత్యహృదయం గురించి ఉంటుంది. దీన్ని పఠిస్తే ఏయే లాభాలు కలుగుతాయో అందులో ఉంటుంది. చివరను ఉండే ఇరవై తొమ్మిది, ముప్పై శ్లోకాలను పఠిస్తే కొత్త శక్తి వస్తుంది. రాములవారు అన్ని శ్లోకాలు పఠిస్తాడు.


ఆదిత్య హృదయం మొత్తం చదివాక శ్రీరాముడికి కొత్త శక్తి వస్తుంది. అర్జునుడు ఏవిధంగా అయితే కురుక్షేత్రంలో తలపడ్డాడో అలా రాములవారు కూడా తలపడతారు. దేవుడికే అంత ధైర్యాన్ని ఇచ్చి యుద్ధంలో విజేతగా నిలిపేలా చేసినా ఆదిత్య హృదయం సామాన్యులకు ఎంతటి శక్తిని ఇస్తుందో అర్థం చేసుకోవొచ్చు.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×