Big Stories

Air Filter:గాలి కాలుష్యానికి చెక్..! స్కూల్ విద్యార్థిని పరిష్కారం..

Air Filter:టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు కూడా వినూత్నంగా ఆలోచించడం మొదలుపెట్టారు. పరిశోధనలకు, ప్రయోగాలకు వయసుతో సంబంధం లేదని ఇప్పటికే ఎంతోమంది పిల్లలు నిరూపించారు. తాజాగా లండన్‌కు చెందిన ఓ స్కూల్ విద్యార్థిని చేసిన ప్రయోగం సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణులనే మెప్పించింది.

- Advertisement -

లండన్‌లోని హడ్డర్స్‌ఫీల్డ్‌లో నివసించే 12 ఏళ్ల ఎలనార్ వుడ్స్ హై బర్టన్‌లో చదువుకుంటోంది. తను బ్రీత్ బెటర్ అనే పేరుతో ఓ కొత్త బ్యాగ్‌ను తయారు చేసింది. ఈ బ్యాగ్ చూడడానికి మామూలుగానే ఉన్నా గాలిని ఫిల్టర్ చేయడంతో పాటు గాలి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల నుండి విద్యార్థులను కాపాడుతుంది. ఇందులో వారు బుక్స్‌, లంచ్ లాంటివి కూడా తీసుకువెళ్లవచ్చని ఎలనార్ అంటోంది.

- Advertisement -

ఎలనార్ ఈ బ్యాగ్‌ను తయారు చేయడానికి తన తల్లే స్ఫూర్తి అని చెప్తోంది. తన తల్లికి ఎప్పటినుండో అస్తమా సమస్య ఉందని, కోవిడ్ సమయంలో ఆ సమస్య వల్ల తామందరం చాలా బాధపడ్డారని ఎలనార్ చెప్పుకొచ్చింది. తన తల్లి కోసం వారి ఇంట్లో ఒక ఎయిర్ ఫిల్టర్ కూడా ఏర్పాటు చేశారని తెలిపింది. తను ఎయిర్ ఫిల్టర్ గురించి తన ఫ్రెండ్స్‌కు, క్లాస్‌మేట్స్‌కు చెప్తూ ఉండేదని అంటోంది ఎలనార్.

ఈరోజుల్లో గాలిలో కాలుష్యం గురించి, దాని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తనకు అవగాహన ఉందంటోంది ఎలనార్. గాలి కూడా హానికరంగా మారడం.. తను ఈ బ్రీత్ బెటర్ బ్యాక్‌ప్యాక్‌ను తయారు చేయడానికి మరో కారణమని బయటపెట్టింది. ఇది తయారు చేయడంలో తన తల్లి ఆనాబెల్ హోబ్స్ కూడా ఎంతో సహాయపడిందని ఎలనార్ తెలిపింది.

సోలార్ ఎనర్జీ, డైనమోను కలిపి ఈ బ్యాక్‌ప్యాక్‌ను తయారు చేసినట్టుగా ఎలనార్ చెప్తోంది. ఇది బ్లూ కలర్‌లో డెకరేట్ చేయడం ద్వారా చూడడానికి కూడా అందంగా ఉంటుందని తను భావించింది. కొంతమంది ఈ ఎయిర్ ఫిల్టర్‌ను ఉపయోగించడం ప్రారంభించిన అది భూమికి ఎంతో మేలు చేస్తుందని ఎలనార్ తెలిపింది. అందుకే ఎలనార్ తయారు చేసిన ఈ బ్రీత్ బెటర్ బ్యాక్‌ప్యాక్‌కు నేషనల్ ఇన్నోవేషన్ కాంటెస్ట్‌లో ప్రైజ్ దక్కింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News