EPAPER
Kirrak Couples Episode 1

Identify Geomagnetic Storm : స్టార్మ్‌ నుండి రక్షించే టెక్నాలజీ.. త్వరలోనే..

Identify Geomagnetic Storm : స్టార్మ్‌ నుండి రక్షించే టెక్నాలజీ.. త్వరలోనే..

Identify Geomagnetic Storm

సాధారణంగా తుఫాన్లు సహజంగా వచ్చి ఎంతో నష్టాన్ని మిగిలించి వెళ్తాయి. కానీ అలా కాకుండా అంతరిక్షంలో ఉండే శాటిలైట్లు కూడా స్టార్మ్ రూపంలో భూమిని పలకరిస్తాయి. అలాంటి వాటిని శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు గమనిస్తూ.. వాటి వల్ల నష్టం కలగకుండా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇప్పటివరకు జియోమ్యాగ్నటిక్ స్టార్మ్‌ను గుర్తించడానికి టెక్నాలజీ పూర్తిగా డెవలప్ అవ్వలేదు. తాజాగా శాస్త్రవేత్తలు దానికి ఓ పరిష్కారం కనుగొన్నారు.


అంతరిక్షం నుండి భూమి వరకు జరిగే మార్పులను శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. అయితే జియోమ్యాగ్ననిట్ స్టార్మ్‌ను గుర్తించి, వాటి గురించి హెచ్చరించడానికి కూడా ఓ టెక్నాలజీ ఏర్పాటయ్యింది. సూర్యుడితో పాటు తిరిగే కోరోటేటింగ్ ఇంటర్యాక్షన్ వల్ల ఈ జియోమ్యాగ్నటిక్ స్టార్మ్స్ ఏర్పడతాయి. సోలార్ రొటేషన్ వల్ల ఈ స్టార్మ్ 27 రోజులకు ఒకసారి రిపీట్ అవుతూ ఉంటుంది.

సూర్యుడి నుండి భూమికి సోలార్ విండ్ రావడానికి కనీసం అయిదు రోజుల సమయం పడుతుంది. దీని వల్ల ఈ మ్యాగ్నటిక్ స్టార్మ్ గురించి హెచ్చరించడం కష్టమవుతుంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ద్వారా మ్యాగ్నటిక్ స్టార్మ్‌ను కొన్ని గంటల ముందే గుర్తించి హెచ్చరికలు జారీ చేయవచ్చు. సోలార్ విండ్, మ్యాగ్నటిక్ ఫీల్డ్ మధ్య కొలతను బట్టి మ్యాగ్నటిక్ స్టార్మ్‌ను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.


సోలార్ సిస్టమ్‌ను అందులో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండడం వల్ల మ్యాగ్నటిక్ స్టార్మ్‌ను కొన్ని గంటల ముందే గుర్తింవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హై స్పీడ్ సోలార్ విండ్ సమయంలో స్టార్మ్ గుర్తించడం కష్టమవుతుందని భావించిన శాస్త్రవేత్తలు.. సూర్యుడిలోని కరోనల్ హోల్స్ మార్పుల వల్ల మ్యాగ్నటిక్ స్టార్మ్‌ను గుర్తించవచ్చని పరిశోధనల్లో కనుగొన్నారు. దీని ద్వారా వారు ఓ కొత్త అధ్యాయనాన్ని ప్రారంభించినట్టుగా తెలిపారు.

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Hyderabad Real Boom: రివర్ వ్యూ.. లేక్ వ్యూ.. తేడా వస్తే ‘రోడ్ వ్యూ’.. ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×