BigTV English

Human Body:మనిషి శరీరంలోకి వెళ్లగలిగే రోబో..

Human Body:మనిషి శరీరంలోకి వెళ్లగలిగే రోబో..

Human Body:కొన్ని సినిమాల్లో సీన్స్ చూస్తుంటే.. అసలు ఇలా జరిగే అవకాశం ఉందా అని ఆశ్చర్యంగా ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే మనకు ఊహకు అందని ఎన్నో టెక్నాలజీలు మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. అయితే 40 ఏళ్ల క్రితం ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో జరిగిన విషయాన్ని నిజంగా చేసి చూపించారు శాస్త్రవేత్తలు. వారు చేసిన పరిశోధనలు త్వరలోనే సెన్సేషన్ సృష్టించబోతుందని వారు తెలిపారు.


ఇప్పటికే రోబోటిక్స్ అనేది అనుకున్న దానికంటే చాలా వేగంగా డెవలప్‌మెంట్‌ను సాధిస్తోంది. రోబోల తయారీ అనేది మొదలయినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో విధాలుగా రూపాంతరం చెందినా కూడా ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఇంకా కొత్త కొత్త విధానాలతో రోబోలను తయారు చేస్తూనే ఉన్నారు. అంతే కాకుండా ముఖ్యమైన ఎన్నో రంగాలకు ఉపయోగపడేలా రోబోలను తయారు చేసి ఇచ్చారు శాస్త్రవేత్తలు. తాజాగా మరోర కొత్త రోబో త్వరలోనే మార్కెట్లోకి రానున్నట్టు తెలుస్తోంది.

మామూలుగా సైజ్ కంటే చాలా చిన్న సైజ్ రోబోల తయారీలో కూడా మార్కెట్లో నడుస్తోంది. ఇప్పుడు అదే కేటగిరిలో మరో రోబో కూడా తయారు కానుంది. అదే నానోబోట్. కేవలం 1 నుండి 100 నానోమీటర్ల పొడవుతో ఈ రోబో తయారుచేయబడుతుంది. ఇది కేవలం మీటర్‌లోని ఒక బిలియన్ శాతం మాత్రమే ఉంటుంది. అంటే మనిషి కంటికి కనిపించనంత చిన్నగా ఈ రోబో ఉంటుంది. మరి ఇంత చిన్ని రోబోతో ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా? ఇది కేవలం కొన్ని పనులను ప్రత్యేకంగా చేయడానికి మాత్రమే డిజైన్ చేయబడుతుంది.


ఎన్నో ఏళ్ల క్రితమే ఇలాంటి రోబోల తయారీ సాధ్యమని నిపుణులు తెలిపారు. ఇన్నాళ్లకు ఇది సాధ్యపడనుంది. నానోబోట్స్ తయారీ కోసం టెక్నిక్స్, మెటీరియల్స్ అనేవి శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్ల నుండి సేకరిస్తున్నారు. ఎన్నో యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఇందులో భాగమయ్యాయి. ఇప్పటికే ఎన్నో విభాగాల్లో సక్సెస్ అయిన నానోబోట్స్ ఉపయోగించబడుతున్నాయి. ఇవి పూర్తిస్థాయిలో మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

నానోబోట్స్ అనేది మ్యాగ్నటిక్ ఫీల్డ్స్‌తో, ఎలక్ట్రిక్ సిగ్నల్స్ సాయంతో పనిచేస్తాయి. కొన్ని మాత్రం తామంతట తామే నడుస్తాయి. అవసరం ఉన్నప్పుడు కొన్ని నానోబోట్స్ కలిసి ఒక నానోమెషీన్‌లాగా కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా వైద్య రంగంలో ఈ నానోబోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇవి లంగ్స్‌లో పనిచేయగలవని, మందులను అందించగలవని, నిమోనియా కలిగించే బ్యాక్టిరియాను అంతం చేయగలవని వారు బయటపెట్టారు. ఇవి లంగ్స్‌లోకి చేరుకొని యాంటిబయోటిక్స్‌ను నేరుగా అందించగలవని కూడా వారు తెలిపారు.

Cyber Crimes in IT:ఐటీలో సైబర్ నేరాలకు అదే కారణం..!

Russia Ukraine war:ఇండియాకు లాభం తెచ్చిపెట్టిన రష్యా, ఉక్రెయిన్ వార్..

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×