Big Stories

ITR or Loan : ఐటీఆర్‌ లేదా? లోన్‌ కావాలా?

ITR or Loan : బ్యాంకులు భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేయాలంటే ఆదాయపు పన్ను రిటర్నులు తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఐటీఆర్ ఉంటుంది కాబట్టి సులభంగానే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. కానీ… వార్షికాదాయం పన్ను పరిమితి కంటే తక్కువ ఉన్నవాళ్లు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఐటీఆర్ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్లు ఐటీఆర్‌ లేకుండా కూడా లోన్‌ తీసుకోవచ్చు.

- Advertisement -

ఐటీఆర్‌ లేకుండా పర్సనల్‌ లోన్‌ ఈజీగా తీసుకోవచ్చు. దీనికి ఎలాంటి తనఖా అవసరం లేదు. అప్లై చేసిన వ్యక్తి ఆదాయం, కేవైసీ వివరాల ఆధారంగా బ్యాంకులు వ్యక్తిగత రుణం మంజూరు చేస్తాయి. కొన్ని బ్యాంకులు కనీస ఆదాయం, క్రెడిట్ స్కోర్‌ను కూడా ప్రామాణికంగా తీసుకోవచ్చు. స్థిరమైన ఆదాయాన్ని ఉండి, గతంలో రుణ ఎగవేతల చరిత్ర లేకుండా ఉంటే… లోన్ ఈజీగా మంజూరు చేస్తారు. ఇక ఉద్యోగుల శాలరీ అకౌంట్లలోకి వచ్చే నిధులను బట్టి… వారికి బ్యాంకులు లోన్లు మంజూరు చేస్తాయి.

- Advertisement -

ఇక సెక్యూరిటీలు లేదా ఇతర ఆస్తులేవైనా తనఖా పెడితే… తక్కువ రిస్క్‌ కాబట్టి ఐటీఆర్‌ లేకుండానే బ్యాంకులు రుణాలిస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్‌లు మొదలైన పెట్టుబడులను తాకట్టు పెడితే అప్పు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఐటీఆర్ లేని స్వయం ఉపాధిదారుడు… ఐటీఆర్ లేదా ఇతర స్థిరమైన ఆదాయం ఉన్న వ్యక్తితో కలిసి ఉమ్మడి రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జాయింట్ లోన్ కాబట్టి బ్యాంకులు ఇద్దరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని లోన్ మంజూరు చేస్తాయి.

ఐటీఆర్, లేదా ఆదాయ ధృవీకరణ పత్రాలు లేనప్పుడు చిన్న మొత్తంలో రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం బెటర్. అప్పు ఇచ్చే సంస్థలు ప్రాథమిక ఆదాయ ధృవపత్రాల ఆధారంగా చిన్న మొత్తాలు రుణంగా ఇస్తాయి. ఇక బ్యాంకులు కొన్నిసార్లు ప్రత్యేక స్కీమ్‌లను ఆఫర్‌ చేస్తుంటాయి. కొందరు ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఇస్తుంటాయి. ఇవి కేవలం కొన్ని గంటల్లోనే మంజూరు అవుతుంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News