Big Stories

Changes in iPhone 16: ఐఫోన్‌ లవర్స్‌కు పండగే..ఐఫోన్ 15 తలదన్నేలా ఐఫోన్ 16లో మార్పులు..!

Five Big Changes in iPhone 16: ఐఫోన్ ఫోన్లకు మార్కెట్లలో ఉన్న క్రేజీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎన్ని మొబైల్ కంపెనీలున్నా..యాపిల్ కంపెనీకి సంబంధఇంచిన ఐఫోన్లకు ఉన్నంత డిమాండ్ మరే ఇతర ఫోన్‌కు ఉండదు. ఇతర కంపెనీలకు చెందిన ఫోన్లతో పోలిస్తే.. ధరలు సైతం చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఇందులో భాగంగానే యాపిల్ కంపెనీ ప్రతీ ఏడాది సెప్టెంబర్‌లో సరికొత్త ఫీచర్స్‌తో ఐఫోన్ అప్ డేటెడ్ మోడళ్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తూనే ఉంది. తాజాగా, తీసుకొస్తున్న ఐఫోన్ 16 లో భారీ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

గతేడాది తీసుకొచ్చిన ఐఫోన్ 15 సిరీస్‌కు తలదన్నేలా ఈ సారి ఐఫోన్ 16ను తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఐఫోన్ 15తో పోల్చితే..ఐఫోన్ 16లో నాలుగు భారీ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. తాజాగా, సెప్టెంబర్‌కు రెండు నెలల సమయం ఉన్నందున సోషల్ మీడియాలో ఐఫోన్ 16 కు సంబంధించి లీక్స్ హల్ చల్ చేస్తున్నాయి.

- Advertisement -

ఐఫోన్ 16 సిరీస్‌లో అతిపెద్ద డిజైన్ మార్పులు చేయనున్నారు. ప్రధానంగా వర్టికల్ కెమెరా లేఅవుట్‌ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఫోన్ నుంచి బ్యాటరీలను ఈజీగా తొలగించేందుకు సరికొత్త మార్పు చేయనుంది. కెపాసిటివ్ బటన్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుందని టాక్.

Also Read: Moto G85: కొత్త ఆటగాడు రెడీ.. కర్వ్డ్ pOLED డిస్‌ప్లే, స్నాపడ్రాగన్ ప్రాసెసర్‌తో మోటో కొత్త ఫోన్.. ఇంత తక్కువ ధరలోనా..?

ఐఫోన్ 15 ప్రోలో ఉన్న యాక్షన్ బటన్ మాదిరిగా ఐఫోన్ 16 లోనూ కొత్తగా ఒక బటన్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఐఫోన్ 16 సిరీస్ కోసం క్యాప్చర్ బటన్‌ను కూడా యాపిల్ తీసుకురానుంది. ఈ బటన్ డివైస్ ఫ్రేమ్ దిగువ కుడి వైపున పవర్ బటన్ కింద ఉండనుంది. ఈ బటన్.. కెమెరాతో ఫోటోలను తీసేందుకు మరింత ఫ్రెండ్లీగా ఉంటూ ఈజీగా ఆపరేటింగ్ చేయవచ్చు. అలాగే యూజర్లు ఈ బటన్ ను మాములుగా ప్రెస్ చేసినప్పుడు కూడా ఫోకస్ చేసేందుకు అనుమతి ఇస్తుంది. అలాగే లాంగ్ ప్రెస్ క్లిక్ చేసిన తర్వాత.. ఇది షట్టర్ ని యాక్టివేట్ నివేదికలు సూచిస్తాయి,

ఐఫోన్ 15లో 48 మెగా పిక్సెల్ ప్రైమరీ వైడ్ కెమెరాతో ప్రధాన కెమెరా అప్ గ్రేడ్‌ని పొందింది. అయితే ఐఫోన్ 16 మోడళ్లకు హైఎండ్ అప్ గ్రేడ్‌లు చేస్తూ..యాపిల్ ఐఫోన్ 16 మోడళ్లతోపాటు 48 మెగా పిక్సెల్ సెన్సార్ ను కూడా అందించనుంది. యాపిల్ గతేడాది ఫ్లాగ్ షిప్ చిప్ సెట్‌ను.. వెనీలా మోడల్‌లో ఉంది. ఐఫోన్ 16లో ఏ18 సిరీస్ చిప్ సెట్ అమర్చనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఐఫోన్ 15 లో కనిపించే ఏ16తో పోల్చితే..ఏ18 ఇప్పటికీ పెద్ద పర్ఫార్మెన్స్ బూస్ట్ కావడానికి అవకాశం ఉంది. అలాగే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను రన్ చేయాల్సి ఉన్నందున ఐఫోన్ 16 మోడళ్లలో ఎక్కువ ర్యామ్‌తో అందుబాటులోకి రానుందని వార్తలు వస్తున్నాయి.

Also Read: ఆఫర్ల వరద.. ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఎంతో తెలిస్తే షాకవుతారు!

ఐఫోన్ 16 సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో మాక్స్ అతి పెద్ద 6.3 అంగుళాలు, 6.9 అంగుళాలు స్క్రీన్‌లతో వచ్చే అవకాశంఉంది. అయితే కొంతమంది నిపుణులు 6.1, 6.7 అంగుళాల స్క్రీన్‌లలో వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను ప్రవేశపెట్టడంతో గణనీయమైన అప్‌గ్రేడ్‌ను పొందే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News