E-Paper
Advertisement

Hyderabad : డాక్టర్ కాబోయి వేశ్య.. మసాజ్ సెంటర్‌లో..

Hyderabad :  డాక్టర్ కాబోయి వేశ్య.. మసాజ్ సెంటర్‌లో..

Hyderabad news today telugu(Telangana news live): అందం ఉంది. మంచి ఆలోచన ఉంది. లక్ష్యం కూడా గొప్పగానే ఉంది. అన్నీ కలిసొస్తే.. అందరూ గౌరవించే పొజీషన్ లో ఉండాల్సి ఉంది. కానీ.. ప్రస్తుతం ఆమె జైలు ఊచలు లెక్కిస్తోంది. మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న కేసులో పోలీసులకు చిక్కి.. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న శృతి జీవితం.. చాలామందికి పాఠంగా మారింది.

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న అపార్ట్ మెంట్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో.. పోలీసులు దాడి చేశారు. పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ పై పోలీసులు దాడి చేసి.. ముగ్గురు నిర్వాహకులు, 10 మంది యువతులు, 18 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిర్వాహకుల్లో ఒకరే.. ఈ శృతి. ఉన్నత చదువులు చదవాలని కలలు కంది. డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగా కష్టపడింది. ఉక్రెయిన్ లో మెడిసిన్ సీటు సంపాదించింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్ ను కంప్లీట్ చేసింది. అయితే రెండో ఏడాది చదివేందుకు డబ్బులు లేకపోవడంతో.. ఫీజు చెల్లించలేకపోయింది. దీంతో ఉక్రెయిన్ నుంచి తిరుగు ప్రయాణమైంది.

డాక్టర్ అవుదామనుకున్న కల.. కలగానే మిగలడంతో.. చేసేదేం లేక తనకిష్టమైన మరో రంగంలో తన అదృష్టాన్ని వెతుక్కునే పనిలో పడింది.. శృతి. ఏదైనా ఏయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ అయ్యేందుకు ప్రయత్నించింది. హైదరాబాద్ అమీర్ పేట్ లో శిక్షణ కూడా తీసుకుంది. అలా ట్రైనింగ్ తీసుకుంటూనే.. డబ్బుల కోసం బంజారాహిల్స్ లోని ఓ స్టార్ హోటల్ లో రిసెప్షనిస్టుగా జాబ్ సంపాదించింది. కానీ డబ్బు సంపాదన క్రమంలో ఎయిర్ హోస్టేస్ కూడా కాలేకపోయింది. అటు డాక్టర్ కావాలన్న కల, ఇటు ఎయిర్ హోస్టేస్ కావాలనుకున్న కోరిక తీరకపోవడానికి ముఖ్యకారణం.. డబ్బు లేకపోవడమే అని బలంగా నమ్మిన శృతి.. కష్టపడకుండానే ఆ డబ్బును సంపాదించాలనుకుంది. త్వరగా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషించింది. ఈజీ మనీ కోసం తప్పుడు దారులను వెతుక్కుంది.

ఈ క్రమంలో.. మసాజ్ సెంటర్ ఓపెన్ చేసిన శృతి.. అసాంఘీక కార్యకలాపాలకు తెరతీసింది. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహించింది. మరో ఇద్దరితో కలిసి.. దందాను నడిపించింది. తాను తప్పు చేయడమే కాకుండా.. మరికొంత మందిని తప్పుడు దారిలోకి మళ్లించింది. అయితే శృతి ఇలా పోలీసులకు చిక్కడం.. ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆమె.. మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తూ.. పోలీసులకు పట్టుబడింది.

డబ్బు సంపాదించడమే లక్ష్యంగా నేటి జీవితాలు సాగుతున్నాయి. అందులో అనుమానం ఏమీ లేదు. కానీ కష్టపడకుండానే డబ్బు సంపాదించవచ్చా..? కాదని తెలుసుకున్న శృతి.. తప్పుడు దారిలోకి వెళ్లింది. డాక్టర్ కావాలనుకున్న శృతి.. చివరకు కటకటాలు లెక్కిస్తోంది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×