Big Stories

Tea : టీ తాగితే బరువు పెరుగుతారా?

tea

Tea : ప్రస్తుతకాలంలో ప్రతి ఒక్కరిపై ఎంతో పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు టీ, కాఫీ తాగుతుంటారు. టీ తలనొప్పిని తగ్గిస్తుందని, డిప్రెషన్‌ను దూరం చేస్తుందని చెబుతుంటారు. రోజు ఉదయం.. అలాగే సాయంత్రం సమయంలో చాలా మంది ఒక టీ తాగుతారు. కానీ కొందరు అయితే రోజూ పదుల సంఖ్యలో టీ తాగేస్తుంటారు.

- Advertisement -

టీ తో ప్రయోజనాలతో పాటు సైడ్ ఎఫెక్స్ట్ కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. టీ తయారీకి ఉపయోగించే పౌడర్‌లో నికోటిన్‌, కెఫిన్‌ ఉంటాయి. నిజానికి టీలో కేలరీలు చాలా ఎక్కువ ఉంటాయి. దీంతో లావైపోతారు. కాకపోతే టీ తాగకపోతే రిలాక్స్‌గా ఉండలేరు. ఒకసారి టీకి బాగా అలవాటు పడితే రానురాను టీ పడకపోతే ఇబ్బందిగా ఉంటుంది. దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉండడం వల్ల అధిక బరువు పెరుగుతారు. టీ తాగడం మానేస్తే సరిపోతుందా, మరి టీ తాగకపోతే ఎలా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. దీనికీ ఓ మార్గం ఉంది. ఈ చిట్కాలు పాటిస్తే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. అంతేకాకుండా బరువు కూడా పెరగకుండా ఉంటారు.

- Advertisement -

క్యాలరీలను తగ్గించుకోవడానికి ఫ్యాట్ మిల్క్ టీలో ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువ కొవ్వు ఉండే పాలని వాడటం వల్ల లావైపోతారు. లేకుంటే ఓట్స్ పాలు, ఆల్మండ్ పాలు, సోయా మిల్క్‌ని ఉపయోగించవచ్చు. అలాగే క్రీమ్ ఉండే పాలకు దూరంగా ఉంటే మంచిది. ఇలా చేయడం వల్ల కూడా క్యాలరీలు తగ్గుతాయి. అంతేకాకుండా బరువు పెరగకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. టీకి అలవాటుపడిపోయాం, మానలేకపోతున్నాం అంటే దానిలో ఉండే చక్కెర శాతాన్ని తగ్గించండి. కుదిరితే పూర్తిగా చక్కెరను తగ్గించడం కూడా ఉత్తమం.

కొద్దిగా చక్కెరను తగ్గిస్తే కేలరీలు కూడా తగ్గుతాయి. దాంతో బరువు పెరగకుండా ఉంటారు. తప్పదు అనుకుంటే దానిలో చెక్కరకు బదులు బెల్లం కాని తేనె కానీ వేసుకుని తాగండి. ఇలా చేయడం వల్ల తియ్యదనం వస్తుంది. అలాగే చక్కెర వల్ల కలిగే నష్టాల నుంచి కూడా దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News