BigTV English

Delhi:- ఢిల్లీలో గాలి కాలుష్యం తగ్గించడానికి కొత్త ప్లాన్..

Delhi:- ఢిల్లీలో గాలి కాలుష్యం తగ్గించడానికి కొత్త ప్లాన్..

Delhi:- ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యం అనేది అదుపు చేయలేనంతగా పెరిగిపోతోంది. అయినా కూడా శాస్త్రవేత్తలు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో శృతిమించిన గాలి కాలుష్యం మొదలయ్యింది ఢిల్లీ రాష్ట్రంలో. అందుకే ఎన్నో ఏళ్ల నుండి అక్కడ కాలుష్యానికి చెక్ పెట్టాలని పరిశోధకులతో పాటు ప్రజలు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే తాజాగా ఓ కొత్త ఐడియాతో వారు ముందుకొచ్చారు.


ఎయిర్ ప్యూరిఫయర్స్ అనేవి ఎంతోకొంత గాలి కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలిని మనుషులకు అందిస్తాయి. అందుకే ఢిల్లీలోని పలు ముఖ్య ప్రదేశాల్లో, కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఔట్‌డోర్ ఎయిర్ ప్యూరిఫయర్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చాందిని చౌక్, వాజిర్పూర్, ఆనంద్ విహార్.. వంటి ప్రాంతాల్లో త్వరలోనే ఎయిర్ ప్యూరిఫయర్స్ ఏర్పాటు కానున్నాయి. ఇవి ఎయిర్ క్వాలిటీని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాయని అధికారులు చెప్తున్నారు.

ఈ ఔట్‌డోర్ ఎయిర్ ప్యూరిఫయర్‌ల ఇన్‌స్టలేషన్ బాధ్యతలను పలు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. ఒక ప్రైవేట్ కంపెనీ వాజిర్పూర్, చాందిని చౌక్ ప్రాంతాల్లో ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటు చేయగా.. ఆనంద్ విహార్ జంక్షన్స్ ట్రాఫిక్ వద్ద ఎయిర్ ప్యూరిఫయర్ ఇన్‌స్టలేషన్ బాధ్యతను మరో ప్రైవేట్ కంపెనీ దక్కించుకుంది. ఈ ప్రాజెక్ట్‌ను ఐఐటీ ఢిల్లీతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డీఆర్ఐఐవీ (ఢిల్లీ రీసెర్చ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇన్నోవేషన్) ముందుకు తీసుకెళ్లనున్నాయి.


ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటు చేయడంతో పాటు గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి, గాలి క్వాలిటీని మెరుగుపరచడానికి మరెన్నో ప్రయత్నాలతో ముందుకొస్తామని అధికారులు చెప్తున్నారు. ప్రాంతాలవారీగా కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రస్తుతం ఎయిర్ ప్యూరిఫయర్ల ఏర్పాటు కోసం ఆయా ప్రాంతాల అధికారులతో చర్చలు జరుగుతున్నాయని, చర్చలు సఫలం అయితే.. 7 నుండి 10 రోజుల్లో ఎయిర్ ప్యూరిఫయర్ల ఏర్పాటు పూర్తవుతుందని తెలిపారు.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) అనుమతిని ఇచ్చింది. ఈ ఎయిర్ ప్యూరిఫయర్లు ఎప్పటికప్పుడు కాలుష్య శాతాన్ని నోట్ చేసుకుంటూ దానిని అదుపులో ఉంచే పనిలో ఉంటాయి. ఇవి పెద్ద టవర్స్ ఆకారంలో కాకుండా చిన్నగా ఉంటాయని, అందుకే వీటిని రోడ్డు పక్కన పెట్టినా.. నడిచే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. చాందిని చౌక్ అనేది ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉండే మార్కెట్ ప్లేస్ కాబట్టి, ఆనంద్ విహార్ అనేది నిరంతరం ట్రాఫిక్ ఉండే ప్రాంతం కాబట్టి, వాజిర్పూర్ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ముందుగా ఎయిర్ ప్యూరిఫయర్స్ కోసం ఈ ప్రాంతాలను ఎంపిక్ చేసినట్టు వారు బయటపెట్టారు.

యూనివర్స్‌లోని అతిపెద్ద బ్లాక్ హోల్ గుర్తింపు..

for more updates follow this link:-Bigtv

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×