Black Hole : భూమిపైనే కాదు అంతరిక్షంలో జరిగే మార్పులు కూడా శాస్త్రవేత్తలను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే తాజాగా జరిగిన సోలార్ స్టార్మ్ శాస్త్రవేత్తలను అయోమయంలో పడేసింది. తాజాగా అలాంటి మరో పరిణామాన్ని వారు గుర్తించారు. దాదాపు సూర్యుడి మాస్‌కంటే ఎక్కువగా ఉండే అతిపెద్ద బ్లాక్‌హోల్‌ను యూకే ఆస్ట్రానాట్స్ గుర్తించారు. దాని సైజ్‌ను చూసి వారే ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ విషయం స్పేస్ సెక్టార్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సూర్యుడి మాస్‌కంటే దాదాపు 30బిన్ రెట్లు పెద్దగా ఉండే అతిపెద్ద బ్లాక్ హోల్ తాజాగా యూకే ఆస్ట్రానాట్స్ కంటపడింది. ఇంత పెద్ద బ్లాక్ హోల్‌ను చూడడం ఇదే మొదటిసారని వారు అంటున్నారు. దీనిపై వారు చేసిన పరిశోధనలు, పరీక్షల గురించి వారు బయపెడుతూ.. ఇది వారికి చాలా కొత్తదనాన్ని ఇస్తుందన్నారు. మామూలుగా బ్లాక్ హోల్స్ అనేవాటిని వారు స్టడీ చేసినా కూడా ఇంత పెద్ద బ్లాక్ అనేది వారి కంటపడడం ఇదే మొదటిసారని చెప్తున్నారు.
అతిపెద్ద బ్లాక్ హోల్స్ అనేవి యూనివర్స్‌లో కనిపించడం సహజమే. మామూలుగా ఇవి సూర్యుడికంటే 10 నుండి 40 బిన్ రెట్లు పెద్దగా ఉంటాయి. మామూలుగా ప్రతీ అతిపెద్ద గ్యాలక్సీల మధ్య ఇలాంటి బ్లాక్ హోల్స్‌ను తరచుగా చూస్తుంటాం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. మిల్కీ వేలో కూడా ఇలాంటి బ్లాక్ హోల్స్ కనిపిస్తుంటాయి. అతిపెద్ద బ్లాక్ హోల్స్ అనేవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయని, అవి ఎక్కడ నుండి ఏర్పడతాయో సరిగ్గా తెలియదని వారు శాస్త్రవేత్తలు తెలిపారు.
యూనివర్స్ అనేది పుట్టిన కొత్తలో పలు గ్యాలక్సీలు కలవడం వల్ల ఈ బ్లాక్ హోల్స్ ఏర్పడి ఉంటాయని కొందరి శాస్త్రవేత్తలు నమ్మకం. గ్రావిటేషనల్ లెన్సింగ్ అనే ప్రక్రియ ద్వారా ఆస్ట్రానాట్స్ ఈ అతిపెద్ద బ్లాక్ హోల్‌ను కనిపెట్టారు. గ్రావిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వారికి ఈ బ్లాక్ హోల్ కనిపించిందన్నారు. హబ్బిల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా దీని ఫోటోలు తీసుకొని సైజ్‌ను నిర్ధారించారు. గ్రావిటేషన్ లెన్సింగ్ ద్వారా ఒక బ్లాక్ హోల్‌ను కనిపెట్టడం ఇదే మొదటిసారి అన్నారు.
మామూలుగా బ్లాక్ హోల్స్ అనేవి వేడిని, ఎనర్జీని లైట్ రూపంలో, రేడియోషన్ రూపంలో విడుదల చేస్తాయి కాబట్టి వాటిని కనిపెట్టడం సులభం అని ఆస్ట్రానాట్స్ అంటున్నారు. అలా కాకుండా బయటపడని బ్లాక్ హోల్స్ కూడా కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని కనిపెట్టడానికే గ్రావిటేషనల్ లెన్సింగ్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా మరెన్నో బ్లాక్ హెల్స్‌ను కనిపెడతామని ఆస్ట్రానాట్స్ చెప్తున్నారు. బ్లాక్ హోల్స్‌తో పాటు ఇంకెన్నో వస్తువులను కనిపెడతామన్నారు.