Big Stories

CM KCR: కేసీఆర్ భయపడుతున్నారా? అందుకేనా ఆ అర్జెంట్ మీటింగ్?

- Advertisement -

CM KCR Meeting Today(Latest News in Telangana): మే 17న బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ మీటింగ్. అర్జెంట్‌గా ఏర్పాటు చేశారు గులాబీ బాస్. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరినీ రమ్మన్నారు. ఇంతటి హాట్ సమ్మర్‌లో.. అంతకుమించి హాట్ హాట్‌గా ఆ సమావేశం ఉండబోతోందని అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ టెన్షన్ అలాంటిది మరి.

- Advertisement -

కర్నాటక ఫలితాలే ఈ సడెన్ మీటింగ్‌కు కారణమంటున్నారు. పక్క రాష్ట్రంలో హంగ్ తీసుకొచ్చి.. కాంగ్రెస్, బీజేపీలను ఆగమాగం చేద్దామనుకున్నారు గులాబీ బాస్. తన సహచరుడైన కుమారస్వామి పార్టీకి దండిగా డబ్బులిచ్చి సాయం చేశారని చెబుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన సొమ్ములతోనే జేడీఎస్ ఆ 20 సీట్లైనా గెలిచిందని అంటున్నారు. కానీ, ఆయన కోరుకున్నది అంతకుమించి సీట్లు.

అదేదో కుమారస్వామి పార్టీని ఉద్దరిద్దామని కాదట కేసీఆర్ ఆలోచన. గతంలో మాదిరే హంగ్ వచ్చేలా చేసి.. కుమారస్వామిని కింగ్ మేకర్ చేయాలనేది ఎత్తుగడ అని తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీల ముందు బేరం పెట్టి.. సీఎం సీటు జేడీఎస్‌కు.. ఎవరు సపోర్ట్ చేస్తారో రండి అంటూ ఆఫర్ ఇవ్వాలని భావించారు. కానీ, ఓటర్లు ఎటూ సరిపోని మెజార్టీ ఇవ్వడంతో.. స్వయంగా కుమారస్వామి కొడుకునే ఓడించి షాక్ ఇవ్వడంతో.. ఇక కర్నాటకలో ఈసారితో జేడీఎస్ ఖేల్ ఖతం. దుకాణం బంద్.

తానొకటి తలిస్తే.. కర్నాటక తీర్పు ఇంకోటి వచ్చిందని గులాబీబాస్ తెగ ఇదైపోతున్నారని అంటున్నారు. అందులోనూ, తనకు ఆగర్భ శత్రువైన కాంగ్రెస్ గెలవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అసలే కాంగ్రెస్. ఏమాత్రం ఛాన్స్ చిక్కినా.. ఫీనిక్స్ పక్షిలా ఎగరగలదు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆ ప్రభావం తెలంగాణలో తప్పకుండా ఉంటుంది. ఇక్కడి కేడర్‌లో ఉత్సాహం రెట్టింపవుతుంది. దేశంలో రానున్నది కాంగ్రెస్ కాలమే అనే మెసేజ్ ఓటర్లకు చేరుతుంది. బీఆర్‌ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు పోలరైజ్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా జరిగితే.. అది కేసీఆర్ కొంపముంచడం ఖాయం అంటున్నారు.

బీజేపీ గెలిచినా.. గులాబీ బాస్ ఇంతలా గుబులు పడేవారు కాదేమో. కమలదళం ఎంతగా ఎగిరెగిరి పడుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఉన్న బలం అంతంతమాత్రమేననేది కేసీఆర్ లెక్క. బీజేపీతో పోయేదేమీ లేదు కాబట్టి.. కాంగ్రెస్‌కు పోటీగా కమలనాథులను పదే పదే కవ్విస్తుంటారని అంటారు. ప్రాబ్లమ్ అంతా హస్తం పార్టీతోనే. ఎమ్మెల్యేల ఫిరాయింపు, సీనియర్ల లొల్లితో.. ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదని లెక్కలేశారు కేసీఆర్. కానీ, కర్నాటక గెలుపుతో ఆ లెక్క తారుమారు అయ్యే ప్రమాదం ఉందని భయపడుతున్నట్టున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, ప్రియాంకగాంధీ సభ, రేవంత్‌రెడ్డి దూకుడుతో.. హస్తం పార్టీ మళ్లీ ఫామ్‌లోకి వస్తోంది. ఈ సమయంలో కర్నాటకలో అధికారంలోకి రావడంతో.. ఇకముందు ఎదురుదాడి మరింత పెరుగుతోంది. అందుకే, వ్యూహాలు మార్చే ఆలోచనలో ఉన్నారు గులాబీ బాస్. కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఏమేరకు ఉంటుందని పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు. అందుకే, అర్జెంటుగా బుధవారం బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారని చెబుతున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహం, బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టడం.. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర అవరణ వేడుకలు, అమవీరుల స్మారకం ఆవిష్కరణ.. ఇలా అనేక అంశాలు ఎజెండాలో ఉండనున్నాయని సమాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News