Big Stories

Chandragrahanam Timings : ఆకాశంలో అద్భుతం.. చంద్రగ్రహణం..

Chandragrahanam Timings : ఆకాశంలో నేడు అద్భుతం ఆవిష్కృతం కానుంది. చంద్రగ్రహణం వేళ ఆకాశంలో జాబిలి కనువిందు చేయనుంది. 2022 సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం నేడు ఏర్పడనుంది. పంచాంగం ప్రకారం చంద్రగ్రహణం మధ్యాహ్నం ప్రారంభమై సాయంత్రం ముగుస్తుంది. ఆ ఖగోళ ఘట్టాన్ని వీక్షించేందుకు ఉత్సాహవంతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్ లోనూ పలు ప్రాంతాల్లో చంద్ర గ్రహణం కనువిందుచేయనుంది. అయితే ఇటానగర్, గువాహటి, సిలిగురి ప్రాంతాల్లో మాత్రమే సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూడవచ్చు. కోల్‌కతా, భువనేశ్వర్, ఢిల్లీ, శ్రీనగర్, చెన్నై, గాంధీనగర్, ముంబయి వంటి ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపించనుంది.

- Advertisement -

ఈ ఏడాది రెండో, చివరి చంద్రగ్రహణం ఇది. హైదరాబాద్ లో సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు గ్రహణం ఆరంభమై.. 7 గంటల 26 నిమిషాలకు ముగుస్తుంది. ఇది పాక్షిక గ్రహణమే. గంటా 46 నిమిషాల పాటు గ్రహణం ఉంటుంది. ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర/దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ సహా పలు దేశాల్లో గ్రహణాన్ని వీక్షించొచ్చు. సంపూర్ణ చంద్ర గ్రహణం 3 గంటల 46 నిమిషాల నుంచి 5 గంటల 12 నిమిషాల వరకు సంభవిస్తుంది. తదుపరి సంపూర్ణ చంద్ర గ్రహణం కోసం 14 మార్చి 2025 వరకు ఆగాల్సిందే.

- Advertisement -

సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే రేఖపైకి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేస్తుంది. భూమి ఉపచ్ఛాయ నుంచి ఛాయలోకి చంద్రుడు ప్రయాణించినప్పుడు గ్రహణం సంభవిస్తుంది.

భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే లైన్లోకి రావడం ఏడాదికి 4 నుంచి 7 సార్లు సంభవిస్తుంది.
సూర్యగ్రహణంతో పోలిస్తే చంద్రగ్రహణాలు ఎక్కువ సమయం వీక్షించొచ్చు. ఈ ఏడాది మేలో సంభవించిన చంద్రగ్రహణం 5 గంటల సమయం తీసుకుంది. ఇటానగర్ లో సంపూర్ణ గ్రహణాన్ని చూడొచ్చు. గువాహటి, చెన్నై, గాంధీనగర్, ముంబైల్లోనూ సంపూర్ణ గ్రహణమే. గ్రహణం 3 గంటల 3 నిమిషాల పాటు కొనసాగనుంది. సంపూర్ణ చంద్రగ్రహణం అంటే.. భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేయడమే. చంద్రుడిపై ఉన్నా గ్రహణాన్ని చూడొచ్చు. భూమి వెనక్కి సూర్యుడు వెళ్లడంతో.. భూగోళాన్ని చీకటి ఆవరిస్తుంది.

తదుపరి చంద్రగ్రహణాలు 2023 మే, అక్టోబర్, 2024 మార్చి, సెప్టెంబర్, 2025 మార్చిలో ఏర్పడనున్నాయి.
ఆ గ్రహణాలు కూడా అమెరికా, పసిఫిక్, ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా, పశ్చిమ ఐరోపా, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో కనువిందు చేయనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News