Ozone Layer:- ప్రస్తుతం భూగ్రహంపై వాతావరణాన్ని ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల గురించి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా భూమికి సూర్యుడి నుండి వచ్చే విపరీతమైన వేడిని తట్టుకునే శక్తి రోజురోజుకీ తగ్గిపోతూ వస్తోంది. ఓజోన్ లేయర్‌లో రంధ్రం పడడం కూడా దీనికి కారణమే. అయితే ఓజోన్ రంధ్రానికి కారణమయ్యే విషయాలను శాస్త్రవేత్తలు తాజాగా కనుక్కున్నారు.
ఓజోన్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తూ, దానికి రంధ్రం కలిగిస్తున్న అయిదు వస్తువులు వాతావరణంలో పెరిగిపోతున్నాయని తాజాగా శాస్త్రవేత్తలు చేసిన స్టడీలో తేలింది. కానీ ఇవన్నీ ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యాన్ అయిన వస్తువులు కావడమే అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే ఎన్నో వస్తువులు.. మానవాళి ఆరోగ్యానికి హాని కలిగించకూడదని ఉద్దేశ్యంతో వాటిని ప్రభుత్వాలు బ్యాన్ చేశాయి. అయినా కూడా అవన్నీ పూర్తిగా బ్యాన్ అయిపోకుండా వ్యాపిస్తూనే ఉన్నాయి. అలాంటివే ఓజోన్‌కు కూడా హాని కలిగిస్తున్నాయని బయటపడింది.
ఓజోన్‌పై ప్రభావం చూపిస్తున్న ఎన్నో వస్తువుల్లో కార్బన్ కూడా ఒకటి. పరిమితికి మించి కార్బన్ గాలిలోకి విడుదల కావడం వల్ల ఓజోన్ లేయర్‌లో రంధ్రం ఏర్పడుతోంది. అయితే ఇంత పరిణామంలో ఓజోన్‌కు హాని కలిగించే వస్తువులు ఎక్కడ నుండి వస్తున్నాయో అని శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓజోన్ లేయర్‌కు హాని కలిగిస్తోంది కూడా అయిదు రకాల క్లోరోఫ్లోరోకార్బన్స్ (సీఎఫ్సీ) అని వారి పరిశోధనల్లో తేలింది. 2010 నుండి 2020 వరకు వారి పరిశోధనలు కొనసాగాయి.
1980ల్లో నుండే సీఎఫ్సీల వల్ల భూమిపై వాతావరణం మాత్రమే కాకుండా ఓజోన్ లేయర్ కూడా ప్రభావితమవుతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. సీఎఫ్సీ అనేవి ఓజోన్ లేయర్‌కు కలిగిస్తున్న హానితో పోలిస్తే.. వాతావరణంపై చూపిస్తున్న ప్రభావం ఎక్కువని తెలుస్తోంది. 2020లో ఈ అయిదు సీఎఫ్సీలు కలిసి దాదాపు 47 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాలిలో కలిసిందని వారి పరిశోధనలు చెప్తున్నాయి. త్వరలోనే ఈ సీఎఫ్సీలకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు వాటిని అడ్డుకునే టెక్నాలజీతో ముందుకొస్తామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
క్యాన్సర్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్..
for more updates follow this link:-Bigtv