EPAPER

Cancer Drugs: క్యాన్సర్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్..

Cancer Drugs: క్యాన్సర్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్..

Cancer Drugs: అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి మందులు తీసుకుంటాం. కానీ అలాంటి మందుల వల్ల మరో కొత్త అనారోగ్య సమస్య పుట్టుకొస్తోంది. ఈమధ్య కాలంలో సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు కనిపించడం కష్టమయిపోతుంది. అయితే ప్రాణాంతక వ్యాధులకు ఉపయోగించే మందుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాంటి వాటిలో యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ కూడా ఒకటి.


ఒకప్పుడు క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ లేదు. కానీ ఈరోజుల్లో అలా కాదు.. క్యాన్సర్‌తో సహా ప్రతీ ప్రాణాంతక వ్యాధికి చికిత్స, మందులు.. అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం క్యాన్సర్ పేషెంట్లకు యాంటీ క్యాన్సర్ డ్రగ్స్‌ను అందిస్తున్నారు వైద్యులు. కానీ అవి క్యాన్సర్ సెల్స్‌ను చంపడంతో పాటు ఇతర సైడ్ ఎఫెక్ట్స్‌కు కూడా కారణమవుతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందుకే కేవలం క్యాన్సర్ సెల్స్‌పై ప్రభావం చూపించి ఇతర సెల్స్‌కు హాని కలిగించకుండా ఉండేలా మందులను తయారు చేయాలని వారు నిర్ణయించుకున్నారు.

ఇదే క్రమంలో శాస్త్రవేత్తలు తయారు చేసిన మొదటి డ్రగ్.. కైన్సిన్ ఇన్హిబిటర్స్. ఈ ఇన్హిబిటర్స్.. క్యాన్సర్ సెల్స్ శరీరంలో వ్యాపించకుండా అడ్డుపడతాయి. క్యాన్సర్ సెల్స్‌ను వ్యాపించేలా చేసే కైన్సిన్ మోటర్ ప్రొటీన్సే వీటి మొదటి టార్గెట్. ట్యూమర్ సెల్‌ను పెంపొందించే సెన్ప్ ఈ అనే ప్రొటీన్‌ను కూడా ఈ ఇన్హిబిటర్స్ అడ్డుకుంటాయి. కానీ సాధారణంగా ఈ సెన్ప్ ప్రొటీన్‌ను కనుగొనడం, దానిని అడ్డుకోవడం చాలా కష్టమైన విషయం.


ఒక ఎనర్జీ మాలిక్యూల్‌ను కలపడం ద్వారా సెన్ప్ ఈ ప్రొటీన్ వ్యాప్తిని తొందరగా అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆ టెక్నిక్‌తనే కైన్సిన్ ఇన్హిబిటర్స్ పనిచేస్తాయి. ఇప్పటికే కేవలం సెన్ప్ ఈ ప్రొటీన్ వ్యాప్తిని అరికట్టడం కోసమే ఇన్హిబిటర్స్ తయారయ్యాయి. కానీ వాటికంటే కైన్సిన్ ఇన్హిబిటర్స్ మరింత మెరుగ్గా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఇన్హిబిటర్స్ ద్వారా వారు చేసిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయని, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ కంటే ఇందులో చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని వారు తెలిపారు. ఇది క్యాన్సర్ పేషెంట్లకు కొత్త భరోసాను ఇస్తుందని వారు నమ్ముతున్నామన్నారు.

Related News

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Big Stories

×