Big Stories

Deepam : ఇంట్లో ఏ సమయంలో దీపం వెలిగించాలి

Deepam : దీపం జ్యోతిః పరబ్రహ్మ! దీపం జ్యోతిః నమో నమః ! దీపంలేని ఇల్లు ప్రాణం లేని శరీరం లాంటింది. మాములుగా ప్రమిద మట్టితో చేసినదై ఉండాలి. ఎందుకంటే మన శరీరం పంచభూతలతో తయారైంది. దీపాన్ని వెలిగించేటప్పుడు ఒక వత్తితో దీపాన్ని వెలిగించరాదు. నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయ సంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం అని ధార్మిక గ్రంధాలు చెబుతున్నాి.

- Advertisement -

దీపారాధన సంధ్యా సమయంలో చేయాలి. దీపారాదన ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేయచ్చు. దేవాలయంలో ఎప్పుడూ దీపం వెలిగించినా పుణ్యమే. ఉద్యోగాలు చేసి ఆలస్యంగా ఇంటికి వచ్చే వాళ్లు అర్ధరాత్రైనా స్నానం చేసి దీపం వెలిగించడంతో తప్పేమీలేదు. ఒక వేళ స్నానం చేయండా దీపం వెలిగించాలనుకుంటే మాత్రం పూజ మందిరంలో కాకుండా బయటకు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంట్లో వెలిగించే దీపం కన్నా పూజా మందిరంలో వెలిగించే దీపం అపూర్వ ఫలితాలను ఇస్తుంది. పూజామందిరంలో వెలిగించే దీపం కన్నా ఆలయంలో వెలిగించే దీపం మరో పదిరెట్లు ఫలితాన్ని ఇస్తుంది.

- Advertisement -

దీపారాధన చేసే టప్పుడు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలా అంటే చేయకూడదు. ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు. అది పద్దతి కాదు. ముందు నూనె పోసిన తర్వాత వత్తులు వేయాలి. వెండికుందులు, పంచ లోహ కుందులు, ఇత్తిడి కుందలతో దీపాలు వెలిగించవచ్చు. కానీ స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు. కుందులను కూడా రోజూ శుభ్రంగా కడిగి ఉపయోగించాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News