BigTV English

2500 year old ornaments: 2500 ఏళ్లనాటి ఆభరణాలు.. తవ్వకాల్లో బయటికి..

2500 year old ornaments: 2500 ఏళ్లనాటి ఆభరణాలు.. తవ్వకాల్లో బయటికి..
2500 year old ornaments

ఆర్కియాలజిస్ట్స్ చేసే పరిశోధనల్లో చాలావరకు విలువైన నిధి, బంగారం, వజ్రాలు లాంటివి బయటపడుతుంటాయి. అప్పుడప్పుడు అస్థిపంజరాలు కూడా వారి తవ్వకాలు బయటపడతాయి. అలా కాకుండా పురాతన కాలంలో దేవాలయాలు కూడా అప్పుడప్పుడు వారికి కనిపిస్తుంటాయి. కానీ తాజాగా ఆర్కియాలజిస్ట్స్ చేసిన తవ్వకాల్లో ఆభరణాలు బయటపడ్డాయి. కానీ అవి బంగారంతో, వెండితో చేసినవి కాదు.


ఉత్తర పోలాండ్‌లో ఆర్కియాలజిస్ట్స్ చేసిన తవ్వకాల్లో 2500 ఏళ్ల నాటి ఓ స్థలం బయటపడింది. ఇది ఒక అరుదైన డిస్కవరీగా వారు పేర్కొన్నారు. అక్కడ ఎన్నో కాంస్య ఆభరణాలను వారి వెలికితీశారు. నెక్లెస్, బ్రేస్లెట్స్, పిన్స్ లాంటి ఆభరణాలు వారి తవ్వకాల్లో బయటపడ్డాయి. వాటితో పాటు ఎన్నో ఎముకలు కూడా ఈ స్థలంలో వారికి కనిపించాయి. వారు వెలికితీసిన ఆభరణాలు చాలా ఏళ్ల క్రితానికి సంబంధించినవి కాబట్టి పాడైపోయిన్నాయి. కాంస్య ఆభరణాలతో పాటు వారికి బట్టతో చేసిన ఆభరణాలు కూడా ఆ తవ్వకాల్లో కనిపించాయి.

పాలిష్ నేలపై ఇలాంటి డిస్కవరీ జరగడం ఇదే మొదటిసారి అని ఆర్కియాలజిస్ట్స్ తెలిపారు. ఇవన్నీ 6 బీసీ కాలానికి చెందినవాటిగా వారు అంచనా వేస్తున్నారు. ఇందులో చాలావరకు వస్తువులు ఇంతకాలం ఒక నది లోతులో ఇరుక్కుపోయిన్నాయని తెలిపారు. పొడి నేలలో జరిపిన తవ్వకాల్లో ఇలాంటివన్నీ బయటపడడం వారికే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు.


ఇప్పటివరకు వారు చేసిన తవ్వకాల్లో ఇన్ని ఎక్కువ వస్తువులు ఒకేచోట ఎప్పుడూ దొరకలేదన్నారు ఆర్కియాలజిస్ట్స్. పైగా ఇవన్నీ బైస్కుపిన్ అనే ఒకే ప్రాంతంలో దొరికాయని, దాని చుట్టుపక్కల ఇంకేమీ దొరకలేదని వారు తెలిపారు. ఆభరణాలతో పాటు ఎముకలు కూడా దొరకడంతో చాలామంది అక్కడ ప్రాణాలు వదిలినట్టు ఆర్కియాలజిస్ట్స్ అంచనా వేస్తున్నారు. వలసల కారణంగా కొందరు అక్కడ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని వారు అన్నారు. ఈ తవ్వకాల్లో బయటపడిన వస్తువులను పరీక్షల కోసం క్రాకోలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి పంపనున్నారు.

New Planet Discovered:కొత్త గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు.. చేరుకోవడం సాధ్యమేనా..?

Shape Changing Robot: షేప్ మార్చుకునే రోబో.. త్వరలోనే మార్కెట్‌లోకి..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×