EPAPER
Kirrak Couples Episode 1

Ancient Idols:- ఇంట్లో పురాతన కాలం నాటి విగ్రహాలను పక్కన పడేయకూడదా….

Ancient Idols:- ఇంట్లో పురాతన కాలం నాటి విగ్రహాలను పక్కన పడేయకూడదా….

Ancient Idols:- ఒక ఊళ్లో ఒక శాస్త్రి గారు వుండేవారు . ఆయన పరమ నిష్ఠా గరిష్టుడు. తాత ముత్తాతల నుంచి వస్తున్న శివ పంచాయతనం వుండేది. శాస్త్రి గారు రోజూ నమక చమకములతో అభిషేకము చేసి శ్రద్దగా పూజ చేస్తూ వుండేవారు. ఒకరోజు వాళ్ళ ఇంటి ఆవిడ గారెలు చేసి, వాళ్ళ పాలేరు కు నాలుగు పెట్టినది. వాడు కమ్మగా తిని, అమ్మా ఇంక నాలుగు వడలు పెట్టు అమ్మా అన్నాడు. ఇంటి ఆవిడ లేవురా అయిపోయినాయి అన్నది.అదేంటి అమ్మగారు ఇంట్లో ఇంకా 23 గారెలు పెట్టుకొని లేవు అంటారు అని అన్నాడు.


ఆవిడ వంటింట్లోకి వెళ్లి లెక్క పెడితే సరిగ్గా 23 గారెలు వున్నాయి. నీకెలా తెలుసురా అని అడిగినది. తెలుసులెండి అని వాడు అన్నాడు. ఈ విషయాన్ని తన భర్త కు తెలిపినది ఆ మహా ఇల్లాలు. శాస్త్రి గారు పాలేరును నిలదీసినాడు ..అదొక విద్య లెండి నాకు మా అయ్య నుంచి వచ్చినది, నాకు ఒక యక్షిణి చెవులో చెబుతుంది ఇదంతా అన్నాడు. ఆ రోజు రాత్రికి శాస్త్రి గారికి నిద్ర పట్టలేదు. పక్క రోజు పాలేరును అడిగాడు. ఒరేయ్ ఇన్ని రోజుల నుంచి నేను పూజ చేస్తున్నాను, నాకు ఏ విద్య రాలేదు, ఏ శక్తి రాలేదు, నీకు ఈ విద్య ఎలా వచ్చినది? ఆ మంత్రము ఏమిటో నాకు చెప్పరా అని అడిగినాడు.

విధి లేక పాలేరు ఆ మంత్రాన్నిమంత్రమును గురువు గారికి చెప్పాడు. తర్వాత రోజు గురువు గారు శ్రద్దగా ఆ మంత్రాన్ని పఠించినాడు. కర్ణ పిశాచి ఇంటి బయట నుంచి పలికినది. శాస్త్రి గారూ అని పిలిచినది. ఏమి కావాలి అని అడిగినది. గురువు గారు ఇంట్లో నుంచి ఎవరూ అని అడిగినాడు. నేను కర్ణ పిశాచిని మీ ఇంట్లోకి రావాలంటే ఆ పూజా మందిరములోని దేవతా మూర్తులను బయట పడెయ్యండి, నేను లోపలి వస్తాను అని అన్నది.


శాస్త్రి గారికి అప్పుడు అర్ధమైనది. ఒరేయ్ మా ఇంట్లో పూజా మందిరములోని దేవతా మూర్తులు ఎంత శక్తి వంతమైనవో, వాటి వల్లే ఈ పిశాచము లోనికి రాలేదు. ఇలా ఎన్ని రోజుల నుంచి నన్ను నా కుటుంబాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడు తున్నాయో గదా, ఇన్నాళ్ళు తెలియ లేదు, పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని, నీవూ వద్దు, నీ మంత్రము వద్దు అని ఆ పిశాచాన్ని వెళ్లి పొమ్మన్నాడు. చేసిన తప్పునకు రెండు లెంపలు వేసుకున్నాడు. పూజా మందిరములో ఉన్న విగ్రహాలు పాతవైనా, అరిగి పోయినా మీ తాత ముత్తాతలు పూజించినవి అవి. వాటిల్లో ఎంతో శక్తి దాగి వుంటుంది. వాటిల్ని పారేయకూడదు. భక్తితో ఒక్క పుష్పం పెట్టండి. అవి చైతన్యమవుతాయి.

ఐనవోలు ఆలయంలో శిలాతోరణాల రహస్యమిదే..

for more updates follow this link:-bigtv

Related News

Shardiya Navratri 2024 : శ్రీ రాముడు కూడా శారదీయ నవరాత్రి ఉపవాసం చేసాడని మీకు తెలుసా ?

Kojagori Lokhkhi Puja: కోజాగారి లక్ష్మీ పూజ ఎప్పుడు ? మంచి సమయం, తేదీ వివరాలు ఇవే

Sarva pitru Amavasya 2024: సర్వ పితృ అమావాస్య నాడు బ్రాహ్మణ విందు ఏర్పాటు చేసి దానం చేస్తే శ్రాద్ధం పూర్తిచేసినట్లే

Horoscope 30 September 2024: నేటి రాశి ఫలాలు.. ఆదాయాన్ని మించిన ఖర్చులు!

Vishnu Rekha In Hand: విష్ణువు రేఖ చేతిలో ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయాలే సాధిస్తారు

Tirgrahi yog 2024 October: త్రిగ్రాహి యోగంలో ఈ 3 రాశుల వారు డబ్బు పొందబోతున్నారు

Lucky Zodiac Sign : 4 రాజయోగాల అరుదైన కలయికతో ఈ 3 రాశుల వారు ధనవంతులు కాబోతున్నారు

Big Stories

×