Big Stories

Adani Enterprises FPO:అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓ విజయవంతం

Adani Enterprises FPO:హిండెన్‌బర్గ్‌ నివేదిక దెబ్బకు కుదేలైన అదానీ గ్రూప్‌కు కాస్త ఊరట దక్కింది. ఆ కంపెనీ రూ.20 వేల కోట్ల ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభించింది. ఇష్యూలో మొత్తం 4.55 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా… 5.08 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా తక్కువ మంది మాత్రమే అదానీ షేర్ల కోసం బిడ్లు వేశారు.

- Advertisement -

సంస్థాగతేతర మదుపరులకు 96 లక్షల 16 వేలకు పైగా షేర్లు కేటాయించగా… మూడు రెట్లకు పైగా స్పందన వచ్చింది. ఇక సంస్థాగత మదుపరులకు కోటీ 28 లక్షలకు పైగా షేర్లు కేటాయించగా… 1.2 రెట్ల స్పందన దక్కింది. ఇక కంపెనీ ఉద్యోగులకు ఒక లక్షా 60 వేలకు పైగా షేర్లు కేటాయిస్తే… కేవలం 55 శాతం షేర్లకు మాత్రమే బిడ్లు వచ్చాయి. అంటే కేవలం 88 వేల షేర్లకు మాత్రమే కంపెనీ ఉద్యోగులు బిడ్లు దాఖలు చేశారు. ఇక రిటైల్‌ ఇన్వెస్టర్లకు 2 కోట్ల 29 లక్షలకు పైగా షేర్లు కేటాయించగా… కేవలం 12 శాతం మాత్రమే, అంటే 27 లక్షల 50 వేల షేర్లకు మాత్రమే బిడ్లు వచ్చాయి. దాంతో… కంపెనీ ఉద్యోగులతో సహా రిటైల్ ఇన్వెస్టర్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓపై పెద్దగా ఆసక్తి చూపకపోయినా… పలువురు సహచర పారిశ్రామికవేత్తల సాయంతో గౌతమ్ అదానీ… ఎఫ్‌పీఓను గట్టెక్కించారని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

ఎఫ్‌పీవో ధరల శ్రేణి రూ.3,112–రూ.3,276 కాగా.. మంగళవారం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు బీఎస్‌ఈలో 3.35 శాతం బలపడి రూ. 2,975 వద్ద ముగిసింది. గత వారం యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,985 కోట్లు సమకూర్చుకున్న కంపెనీ… మొత్తం 33 ఫండ్స్‌కు 1.82 కోట్ల షేర్లు కేటాయించింది. ఒక్కో షేరును రూ. 3,276 ధరలో జారీ చేసింది. షేర్లను కొనుగోలు చేసిన విదేశీ ఇన్వెస్టర్ల జాబితాలో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీ, బీఎన్‌పీ పారిబాస్‌ ఆర్బిట్రేజ్, సొసైటీ జనరాలి, గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, మోర్గాన్‌ స్టాన్లీ ఏషియా, నోమురా సింగపూర్, సిటీ గ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ మారిషన్‌ తదితర కంపెనీలు ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News