Big Stories

TSPSC : తెలంగాణలో పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీ.. దరఖాస్తులకు ఆహ్వానం..

TSPSC : తెలంగాణలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. మొత్తం 247 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతోంది.19 సబ్జెక్టుల్లో అధ్యాపకులను నియమించనున్నారు. ఆటో మొబైల్‌ ఇంజినీరింగ్‌, బయో-మెడికల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌, ఫుట్‌వేర్‌ టెక్నాలజీ, లెటర్‌ ప్రెస్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ, టాన్నెరీ, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, జియాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో నియామకాలు చేపడుతున్నారు.

- Advertisement -

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్‌, బీఆర్క్‌, బీఫార్మసీ, డిగ్రీ, పీజీ చేసి ఉండాలి. అలాగే స్లెట్‌/ నెట్‌/ సెట్‌ లో అర్హత సాధించాలి. లేదా పీహెచ్‌డీ చేసి ఉండాలి. అభ్యర్థులు వయస్స 44 సంవత్సరాలు మించరాదు. అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు రూ.200గా నిర్ణయించారు. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 2022 డిసెంబర్ 14న ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించడానికి 2023 జనవరి 4 చివరి తేదిగా నిర్ణయించారు.

- Advertisement -

సబ్జెక్టులు: ఆటో మొబైల్‌ ఇంజినీరింగ్‌, బయో-మెడికల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌, ఫుట్‌వేర్‌ టెక్నాలజీ, లెటర్‌ ప్రెస్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ, టాన్నెరీ, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, జియాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్‌, బీఆర్క్‌, బీఫార్మసీ, డిగ్రీ, పీజీ, స్లెట్‌/ నెట్‌/ సెట్‌, పీహెచ్‌డీ.
వయసు (01/07/2022 నాటికి): 44 సంవత్సరాలు మించరాదు
అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు: రూ.200. ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 14/12/2022
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04/01/2023

వెబ్‌సైట్‌: https://websitenew.tspsc.gov.in/directRecruitment

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News