Big Stories

TGPSC: గ్రూప్ -2 అభ్యర్థులకు అలర్ట్.. ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం

Edit Option For Group-2 Examination: తెలంగాణ గ్రూప్ -2 అభ్యర్థులకు సంబంధించి టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. ఆ దరఖాస్తులో ఏమైన పొరపాట్లు చేసి ఉంటే, లేదా ఇతర వివరాలు సరిచేయాలనుకుంటే వాటిని సరిద్దికునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. ఈ నెల 16న ఉదయం 10 గంటల నుంచి ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. చివరి తేదీ ఈ నెల 20న సాయంత్రం 5 గంటల వరకు అని పేర్కొన్నది. ఈ అవకాశం చివరిదని, ఆ తరువాత మరో అవకాశం ఉండబోదని స్పష్టం చేసింది. అందువల్ల అభ్యర్థులు ఈ సమయంలో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకున్న తరువాత, నిర్ధారణ చేసుకుని ఫిల్ చేయాలని సూచించింది. ఎవరైతే అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ ను వినియోగించుకోవాలనుకుంటారో వారు.. ఎస్ఎస్ సీ, ఆధార్ కార్డుకు సంబంధించిన పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని అందులో తెలిపింది.

- Advertisement -

కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -2 పరీక్షను ఆగస్టు 7, 8 తేదీలలో నిర్వహించనున్నట్లు ఇదివరకే ప్రకటించింది. మొత్తం గ్రూప్ 2 పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి.

- Advertisement -

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఇదిలా ఉంటే… తెలంగాణ గ్రూప్-4 మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైనటువంటి ధృవపత్రాల పరిశీలన కోసం టీజీపీఎస్సీ తేదీని ఖరారు చేసింది. ధృవపత్రాల పరిశీలనకు ఎంపికైన మెరిట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవడానికి కమిషన్ వీలు కల్పించింది. అదేవిధంగా ధృవపత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని సూచించింది. వెబ్ ఆప్షన్స్ చేసుకున్నవారిని మాత్రమే విడతల వారీగా ధృవపత్రాల పరిశీలనకు అనుమతిస్తామని అందులో తెలిపింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News