Big Stories

SSC CGL 2024: నిరుద్యోగులకు అలర్ట్ .. ఎస్ఎస్‌సీలో 17 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Staff Selection Commission CGL Notification 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 17,727 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షల ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలోని గ్రూప్-బీ, గ్రూప్-సీ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎస్‌ఎస్‌సీ 2024 క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్‌లోగా రాత పరీక్షలు నిర్వహిస్తారు.

- Advertisement -

SSC CGL పరీక్షలు రెండు సెషన్‌లలో నిర్వహిస్తారు. టైర్ -1 పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జరగనుండగా.. టైర్ -2 పరీక్ష డిసెంబర్‌లో నిర్వహిస్తారు. అనంతరం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను గ్రూప్ బి, గ్రూప్- సి పోస్టులకు వేర్వేరుగా నియమిస్తారు. భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ విభాగాలు, సంస్థలు, వివిధ రాజకీయ సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు,ట్రిబ్యునల్‌లో ఉద్యోగాలను ఈ పోస్టుల ద్వారా భర్తీ చేయనున్నారు.

- Advertisement -

Also Read: నిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ?

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత పొందిన వారు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: టైర్ -1, టైర్ -2 తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీ: 24.07.2024

అధికారిక వెబ్ సైట్: ssc.gov.in

దరఖాస్తు విధానం: అభ్యర్థలు ముందుగా అధికారిక వైబ్‌సైట్ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌ను క్రియేట్ చేసుకుని అప్లై చేసుకోవాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News