Big Stories

Railway Jobs 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 1104 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Railway Jobs 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో 1104 యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, నార్త్ ఈస్ట్రన్ రైల్వే ఎన్ఈఆర్ పరిధిలో ఖాళీగా ఉన్న 1104 యాక్ట్ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -

మొత్తం పోస్టుల సంఖ్య: 1104
ఖాళీల వివరాలు:
మెకానిక్ వర్క్‌షాఫ్ (గోరఖ్‌పూర్)- 411
సిగ్నల్ వర్క్‌షాఫ్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్)- 63
బ్రిడ్జి వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్) – 35
మెకానిక్ వర్క్‌షాప్ (ఇజ్జత్ నగర్)- 151
డీజిల్ షెడ్ ( ఇజ్జత్ నగర్ )- 60
క్యారేజ్ అండ్ వ్యాగన్ (ఇజ్జత్ నగర్ )- 64
క్యారేజ్ అండ్ వ్యాగన్ (లఖ్‌నవూ జంక్షన్ )- 155
డీజిల్ షెడ్ (గోండా)- 23
క్యారేజ్ అండ్ వ్యాగన్ (వారణాసి)- 75

- Advertisement -

అర్హత: అభ్యర్థులు కనీసం 50 % మార్కులతో పదో తరగతి సహా, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 2024 జూన్ 12 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
శిక్షణ వ్యవధి: యాక్ట్ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 11, 2024.
అభ్యర్థులు https://ner.indianrailways.gov.in/ వైబ్‌సైట్ ద్వారా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News