Big Stories

PNB Recruitment 2024: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 2700 ఉద్యోగాలు.. అర్హతలివే !

PNB Recruitment 2024: ఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లోని అప్రెంటిస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2700 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.

- Advertisement -

ముఖ్య వివరాలు:
అప్రెంటిస్ పోస్టులు..
మొత్తం ఖాళీల సంఖ్య: 2700
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఖాళీలు:
అండమాన్ నికోబార్- 02, ఏపీ- 27, అరుణాచల్ ప్రదేశ్- 04, అస్సాం-27, బిహార్- 79, చండీగఢ్ – 19, ఛత్తీస్‌గఢ్- 51, డామన్ & డయ్యూ-04, ఢిల్లీ-178, గోవా-04, గుజరాత్-117 , హర్యానా- 226, హిమాచల్ ప్రదేశ్- 83, జమ్మూకశ్మీర్- 83, జార్ఖండ్- 19, కర్ణాటక- 32, కేరళ- 22, లడఖ్-02, మధ్యప్రదేశ్-133, మహారాష్ట్ర- 145, మణిపూర్- 06, మేఘాలయ-02, మిజోరం-02, నాగాలాండ్- 02, ఒడిస్సా- 71, పుదుచ్చేరి-02, పంజాబ్-251, రాజస్థాన్-206, సిక్కిం-04, తమిళనాడు-34, తెలంగాణ-34, త్రిపుర- 13, ఉత్తర్ ప్రదేశ్- 561, ఉత్తరాఖండ్-48, వెస్ట్ బెంగాల్-236.

- Advertisement -

అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: 30.06.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ. 944. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు రూ. 708. దివ్యాంగులు రూ. 472 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
శిక్షణ వ్యవధి: 1 సంవత్సరం.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్  ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు.
పరీక్ష మాధ్యమం: హందీ, ఇంగ్లీష్.
Also Read:నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే !

స్టైఫండ్: నెలకు రూరల్/ సెమీ అర్బన్ ప్రాంతానికి రూ.10,000. పట్టణ ప్రాంతాల్లో రూ.12,000. మెట్రో ప్రాంతానికి రూ. 15,000.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 30.06.2024.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 14.07.2024.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 28.07.2024.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News