Big Stories

NEET PG 2024 Admit Card: నేడు విడుదల కానున్న నీట్ పీజీ అడ్మిట్ కార్డులు.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

NEET PG 2024 Admit Card: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్ పీజీ- 2024) అడ్మిట్ కార్డులు నేడు విడుదల కానున్నాయి. ఈ అడ్మిట్ కార్డులను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ – ఎన్‌బీఈఎంఎస్ విడుదల చేయనున్నది. వాటిని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నది. నీట్ పీజీ – 2024 కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు natboard.edu.in ను సందర్శించి అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకునే వీలుంది.

- Advertisement -

2024 జూన్ 23న నీట్ పీజీ 2024 పరీక్షను దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డుల లభ్యతకు సంబంధించి అభ్యర్థులకు సమాచారం అందిస్తారు. ఎస్ఎమ్ఎస్ లేదా ఈమెయిల్స్ అలర్ట్స్, వెబ్‌సైట్‌ నోటీసుల ద్వారా సమాచారం అందించనున్నారు. అయితే, అడ్మిట్ కార్డులను అభ్యర్థులకు పోస్ట్ లేదా ఈమెయిల్ ద్వారా పంపరు.

- Advertisement -

పరీక్షకు హాజరయ్యేటువంటి అభ్యర్థులు బార్ కోడ్/ క్యూఆర్ కోడ్ అడ్మిట్ కార్డు ప్రింట్ కాపీ, పర్మినెంట్/ ప్రొవిజనల్ ఎస్ఎంసీ/ ఎంసీఈ/ ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ ఫొటోకాపీ, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్ పోర్టు, ఆధార్ కార్డు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇవి లేనియెడలా పరీక్షకు అనుమతించరు.

అయితే, నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019లోని సెక్షన్ 61(2) ప్రకారం వివిధ ఎండీ/ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి నీట్ పీజీ పరీక్షను నిర్వహిస్తారు.

నీట్ పీజీ అడ్మిట్ కార్డు – 2024 ను ఇలా డౌన్లోడ్ చేసుకోవొచ్చు..

1 – natboard.edu.in వద్ద ఎన్‌బీఈఎంఎస్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి

2 – హోమ్ పేజీలో నీట్ పీజీ అడ్మిట్ కార్డు 2024 చెక్ చేసేందుకు లింక్ పై క్లిక్ చేయండి

3 – అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను పేజీలో సబ్మిట్ చేయాలి

4 – ఆ వివరాలను సమర్పించిన తరువాత అడ్మిట్ కార్డు స్క్రీన్ పై కనిపిస్తుంది

5 – భవిష్యత్ అవసరాల దృష్ట్యా అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి

Also Read: గ్రూప్ -2 అభ్యర్థులకు అలర్ట్.. ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం

ఇదిలా ఉంటే.. ఇటీవల వెలువడిన నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాల చుట్టూ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ పీజీ నిర్వహణపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పేపర్ లీక్, ఫలితాల్లో అవకతవకలు జరిగినట్లు భారీగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా స్పందించారు. దీనిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు జులై 8న విచారణ జరపనున్నది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News