Big Stories

MHSRB Recruitment: వైద్యారోగ్యశాఖలో 435 ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే ?

MHSRB Recruitment 2024: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ ఉద్యోగాల కోసం అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -

ముఖ్య వివరాలు:
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు..
మొత్తం ఖాళీల సంఖ్య: 435

- Advertisement -

మల్టీ జోన్-1: 271 పోస్టులు
మల్టీజోన్-2: 164 పోస్టులు
విభాగాల వారీగా పోస్టులు..
డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్: 431 పోస్టులు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్: 04 పోస్టులు
అర్హత: అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి.
వయోపరిమితి: 01.07. 2004 నాటికి 18 – 45 వయస్సు ఉండాలి.
ఫీజు: రూ. 500, ప్రాసెసింగ్ ఫీజు. 120 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ, ఈడబ్ల్యూఎస్,ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగులకు మినహాయింపు ఉంటుంది.
Also Read: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. అర్హతలివే !

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
జీతం: రూ.58, 850 – 1,37,050
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 02.07. 2024.
దరఖాస్తు చివరి తేదీ: 11.02. 2024

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News