Big Stories

IBPS RRB Notification: నేడే లాస్ట్ డేట్.. రీజినల్ రూరల్ బ్యాంకులో 9,995 ఉద్యోగాలు

IBPS RRB Notification: బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. దేశ వ్యాప్తంగా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే నియామక పరీక్షకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 9,995 ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ విడుదల చేసిన నోటిఫికేషన్ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఏపీలో 450 పోస్టులు ఉండగా..తెలంగాణలో 700 పోస్టులు ఉన్నాయి.

- Advertisement -

కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XIIIల ద్వారా గ్రూప్-A ఆఫీసర్స్(స్కేల్-1,2&3), గ్రూప్ -B ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్)పోస్టుల భర్తీకి మొదట జూన్ 7 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అని పేర్కొనగా.. తర్వాత జూన్ 27న దరఖాస్తు చేసుకునేందుకు ఐబీపీఎస్ జూన్ 30 వరకు గడువు పొడిగించింది.

- Advertisement -

కనీసం డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న వారు అధికారికి వెబ్ సైట్ WWW.IBPS.INలో ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసి ఉండాలి. దీంతోపాటు కంప్యూటర్ నాలెడ్జి తప్పనిసరిగా ఉండాలి.

జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.850 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాల అభ్యర్థులు రూ.175 పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఫారంను ప్రింట్ తీసుకోవడానికి జులై 12 వరకు గడువు ఉంది. ఇక, ఆగస్టులో ప్రిలిమ్స్..సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మెయిన్స్ నిర్వహించనున్నారు.

Also Read: వైద్యారోగ్యశాఖలో 435 ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే ?

అభ్యర్థులు ముందుగా IBPS అధికారిక వెబ్ సైట్ IBPS.IN ఓపెన్ చేయాలి. తర్వాత హోం పేజీలో IBPS RRB రిక్రూట్ మెంట్ 2024 లింక్‌ను క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త యూజర్ అయితే.. అవసరమైన వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు.. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత.. అప్లికేషన్ ఫారం పూర్తి చేయాలి. అనంతరం రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్ చెల్లించాలి. చివరికి అన్ని వివరాలను చేసుకొని ఫారం సబ్మిట్ చేయాలి.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News