Big Stories

Central Bank of India Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగాలు..!

Central Bank of India Recruitment 2024: బ్యాంక్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు శుభవార్త. బ్యాంక్‌లో జాబ్ చేయాలనుకునే వారు రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం సాధించవచ్చు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు ఇది సువర్ణావకాశం.

- Advertisement -

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేయాలని ఆసక్తి ఉన్న వారు ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్, వాచ్‌మెన్/గార్డనర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు.

- Advertisement -

అర్హత:

ఫ్యాకల్టీ: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి రూరల్ డెవలప్‌మెంట్‌లో MSW/ MA/ సోషియాలజీ/ సైకాలజీ/ B.Sc (అగ్రికల్చర్)లో MAతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. బీఏతోపాటు బీఈడీ అర్హతతో ఉండాలి. అలాగే అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి.

Also Read: IAF Agniveer Recruitment: అగ్నివీర్‌లో మ్యూజిషియన్ ఉద్యోగాలు.. అర్హతలివే..

ఆఫీస్ అసిస్టెంట్:

అభ్యర్థులు BSW/BA/B.Comతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానంతో గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.

అటెండర్లు:

అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

తోటమాలి/చౌకీదార్:

అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:
అభ్యర్థుల వయస్సు 22 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి

Also Read: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?

జీతం:
ఫ్యాకల్టీ – నెలకు రూ 20000
ఆఫీస్ అసిస్టెంట్ – నెలకు రూ 12000
అటెండర్ – నెలకు రూ 8000
చౌకీదార్/గార్డనర్ – నెలకు రూ 6000

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ , centralbankofindia.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 31 లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News