Big Stories

World Food Safety Day 2024: ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం.. చరిత్ర, ప్రాముఖ్యత మీకు తెలుసా..?

World Food Safety Day 2024 Importance, Theme, History and More: ‘వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే’ 2024 (WFSD) ప్రతి సంవత్సరం జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్లన ప్రజలు ఆహార పదార్థాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే జరుపుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే.. ప్రతి ఒక్కరికి సురక్షితమైన, పోషకమైన, ఆహారంపై ప్రాధాన్యతపై అవగాహన కల్పించడమే ‘వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే’ ముఖ్య ఉద్దేశం.

- Advertisement -

ఐక్యరాజ్యసమితి 2018లో జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ఇతర సమూహాలతో కలిసి ఆహార భద్రతపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీని ద్వారా శుభ్రమైన ఆహారం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. అలాగే కలుషిత ఆహారం తింటే అనారోగ్య సమస్యలుతలెత్తే అవకాశం ఉంటుందని తెలియజేస్తారు.

- Advertisement -

ప్రాముఖ్యత..

ఆహార భద్రత అనేది ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్య. కలుషిత ఆహారం అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

Also Read: Danish PM hit by Man: తీవ్ర కలకలం.. ఏకంగా దేశ ప్రధానిపై వ్యక్తి దాడి..

ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని..

తినే ఆహారం మన ఆరోగ్యానికి సురక్షితమైనదిగా ఉండాలి.

ఆర్థిక ప్రభావం..

పెరిగిన ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, ఉత్పాదకత కోల్పోయిన కారణంగా ఆహార సంబంధిత వ్యాధులు గణనీయమైన ఆర్థిక భారాన్ని పెంచుతాయి. ప్రసుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఆరోగ్యకరమైన ఆహారం తినకపోవడమే..

ప్రపంచ ఆహార వాణిజ్యం..

అంతర్జాతీయ వాణిజ్యానికి సురక్షితమైన ఆహారం అవసరం. ప్రపంచ మార్కెట్లలో తమ ఆహార ఉత్పత్తులు ఆమోదయోగ్యంగా ఉండేలా దేశాలు తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలి.

Also Read: Danish PM hit by Man: తీవ్ర కలకలం.. ఏకంగా దేశ ప్రధానిపై వ్యక్తి దాడి..

నిరంతర అభివృద్ధి..

ఆహార భద్రత అనేది ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అనేక సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGలు)తో ముడిపడి ఉంది. సురక్షితమైన ఆహారాన్ని నిర్ధారించడం ఈ లక్ష్యాలను సాధించడానికి దోహదం చేస్తుంది.

‘వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే’ 2024 థీమ్ ఇదే..

ప్రిపేర్ ఫర్ అన్ఎక్స్‌పెక్టెడ్(Food Safty Prepare for the Unexpected) అనేది ‘వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే’ 2024 థీమ్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) తెలిపింది.

Also Read: UN General Assembly: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో 5 దేశాలు ఎంపిక.. పాకిస్తాన్‌కు చోటు?

‘వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే’ సందర్బంగా.. ఆహార భద్రత కోసం పాటింటాల్సిన కొన్ని చిట్కాలు

  • ఇంటిని ఆరోగ్యంగా ఉంచుకోండి.. తాజా ఆహారపదార్ధాలను మాత్రమే తినండి.
    వంట చేసే పాత్రలు శుభ్రంగా ఉండేలా చూసుకోండి.
  • మాంసాహారాలు వండేటప్పుడు శుభ్రంగా కడగటం అలవాటు చేసుకోండి.. ఇలా చేయడం వల్లన బాక్టీరియాను దూరం చేయవచ్చు.
  • సరైన ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఆహారాన్ని వండటం అలవాటు చేసుకోండి. ఫాస్ట్ ఫుడ్ లను తినడం తగ్గించుకోండి.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News