Big Stories

Hungary: ఈ బంపరాఫర్.. నలుగురు పిల్లలు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నవాళ్లకు మాత్రమే..

Hungary PM Viktor Orban: ఐరోపా దేశమైనటువంటి హంగేరీ వినూత్న ప్రయత్నాలు చేస్తున్నది. తాజాగా ఆ దేశ ప్రజలకు సంచలన ఆఫర్ చేసింది. నలుగురు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే వారు జీవితాంతం ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరంలేదని ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ ప్రధానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీనిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

- Advertisement -

‘ఐరోపాలో జననాలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో వలసలు పెరుగుతున్నాయి. వాటిని తగ్గించుకునేందుకు జనాభాను పెంచుకునేందుకు వలసదారులను ఆహ్వానించాల్సి వస్తున్నది. అందుకే మేం విభిన్న ఆలోచనలతో ముందుకురావాల్సి వచ్చింది. కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువమందిని కనే మహిళలకు తమ జీవితకాలం వ్యక్తిగత ఆదాయ పన్నును చెల్లించాల్సిన అవసరంలేదు’ అంటూ హంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్ తాజాగా ఈ ప్రకటన చేశారు.

- Advertisement -

అంతేకాదు.. ఈ ఆదాయపు పన్ను మినహాయింపుతోపాటు పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద కార్లు కొనుగోలు చేసేందుకు వారికి సబ్సిడీ కూడా ఇస్తామంటూ హంగేరీ ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా పిల్లల పెంపకం కోసం దేశవ్యాప్తంగా 21 వేల క్రెచ్ లను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇలాంటి మినహాయింపులతో పెళ్లిళ్లు, కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించినట్లవుతుందని అక్కడి సర్కారు భావిస్తున్నది.

Also Read: అడ్డంగా దొరికిన హిందుజా ఫ్యామిలీ, ఇంటి సేవకుల వేతనాలు, నాలుగున్నరేళ్ల జైలు

కాగా, గతంలో కూడా హంగేరీ ప్రభుత్వం ఇలాంటి బంపరాఫర్లను ప్రకటించింది. పెళ్లిళ్లు, జననాల రేటును పెంచేందుకు ఓ స్కీమ్ ను కూడా ప్రవేశపెట్టింది. దానికింద, 41 ఏళ్లు రాకముందే పెళ్లి చేసుకునే అమ్మాయిలకు 10 మిలియన్ ఫోరింట్స్ అంటే హంగేరీ కరెన్సీని సబ్సిడీ రుణాలను అందజేసింది. పెళ్లి అయిన తరువాత ఆ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిస్తే రుణంలో మూడోవంతును కూడా మాఫీ చేస్తామంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. ఒకవేళ ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ సంతానం కలిగితే మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని తెలిపింది. ప్రస్తుతం 96.4 లక్షలుగా ఉన్న హంగేరీ జనాభాను పెంచేందుకు ప్రభుత్వం ఈ ఆఫర్లను ప్రకటిస్తూ వస్తున్నది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News