Big Stories

Woman found dead in python: ఇండోనేషియాలో దారుణం, మహిళను మింగేసిన కొండ చిలువ

Woman found dead in python: ఇండోనేషియాలో దారుణం చోటు చేసుకుంది. 10 మీటర్ల కొండ చిలువ ఓ మహిళను అమాంతంగా మింగేసింది. మహిళ కోసం ఆమె భర్త వెతుకుతుండగా కొండ చిలువ నోటిలో కాళ్లు కనిపించాయి. స్థానికులతో కలిసి కొండ చిలువను చంపి చేసేసరికి ఆమె అప్పటికే చనిపోయింది.

- Advertisement -

ఇండోనేషియా గురించి చెప్పనక్కర్లేదు. అమెజాన్ తర్వాత అంత దట్టమైన ఫారెస్టు ప్రాంతంగా చెబుతుంటారు. సౌత్ సులవేసి ప్రావెన్స్ కొండ చిలువలకు ఫేమస్. ఎపొడవైన చెట్ల మధ్య అవి సంచరిస్తాయి. ఆ ప్రాంతంలో మనుషులు సింగిల్‌గా కనిపిస్తే చాలు వారి పనైపోయినట్టే. వారిని అమాంతంగా మింగేస్తాయి ఫైథాన్లు.

- Advertisement -

అక్కడ సమీపంలోని ఉండే ఓ ఏజెన్సీ ప్రాంతం ఉంది. స్థానిక గిరిజన తెగకు చెందిన 36 ఏళ్ల సరయాతి అనే మహిళకు ఐదుగురు పిల్లలున్నారు. వారిలో ఓ చిన్నారి అనారోగ్యం బారిన పడడంతో మందుల కోసం పొరుగుతున్న ప్రాంతానికి వెళ్తోంది. పొడవాటి చెట్ల మధ్య వెళ్తున్న ఆమెను అమాంతంగా మింగేసింది
ఓ పైథాన్.

ఎంతకీ భార్య రాకపోవడంతో ఆమె భర్తతోపాటు మరో ఇద్దరు కలిసి కత్తులు పట్టుకుని బయలు దేరాడు. దారిలో ఓ చెట్టు దగ్గర చెప్పులు కనిపించాయి. సమీపంలో వెతుకుతుంటే ఓ కొండ చిలువ కదల్లేదని పరిస్థితిలో ఉంది. చివరకు పైథాన్ నోటిలో కాళ్లు కనిపించడంతో దాన్ని అక్కడే చంపేశాడు. వెనుక నుంచి పైథాన్ శరీరాన్ని కత్తితో కట్ చేసేసరికి మహిళ కనిపించింది అప్పుటికే ఆమె చనిపోయింది. ఆ తరహా ఘటనలు రేర్‌గా జరుగుతాయి.

ALSO READ:  పెద్దన్న పీఠం కోసం ఉద్ధండ పిండాల పోటీ.. అమెరికాలో ఏం జరుగుతోంది ?

ఇటీవలకాలంలో ఆ ప్రాంతంలోని చాలామందిని కొండ చిలువలు మింగేస్తున్నాయి. ఇదే ప్రావెన్సులోని గత నెల ఓ మహిళను పైథాన్ ఇలాగే మింగేసింది. ఇప్పుడేకాదు 2018 నుంచి ఆ తరహా ఘటనలు అదే ప్రావెన్సులో జరుగుతున్నాయి. కాకపోతే ఆ విషయం బయట ప్రపంచానికి తెలియలేదు. అందుకే ఆయా ప్రాంతాల్లో వ్యక్తులు సింగిల్ బయటకు వెళ్లరు. ఒకవేళ వెళ్లినా బలమైన ఆయుధాలను వెంట తీసుకుని వెళ్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News