Big Stories

G7 Summit 2024: ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడర్‌కు కట్టుబడి ఉన్నాం.. ప్రధాని మోదీతో జీ7 దేశాల ప్రతినిధులు

G7 Summit 2024: మూడు రోజుల జీ7 సమ్మిట్ 2024 ముగింపు రోజున సభ్య దేశాల ప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా జీ7 దేశాల నాయకులు ఇండియా- మిడిల్ ఈస్ట్- యూరోప్ ఎకనామిక్ కారిడర్(IMEC) అభివృద్ధిని ప్రోత్సాహించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇది భారతదేశానికి గొప్ప విజయం అని చెప్పొచ్చు.

- Advertisement -

గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్ కార్యక్రమాలు, ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్టులు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు పెట్టుబడి కోసం పరివర్తనాత్మక ఆర్థిక కారిడార్‌లను అభివృద్ధి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని.. అలాంటి వాటికి ప్రోత్సాహాన్నిస్తామని జీ7 దేశ ప్రతినిధులు ఉమ్మడి ప్రకటన చేశారు. ఇందులో ఇండియా- మిడిల్ ఈస్ట్- యూరోప్ ఎకనామిక్ కారిడర్ కూడా ఉంది.

- Advertisement -

కాగా గతేడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీ వేదికగా ఇండియా, అమెరికా, యుఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ దేశాలు జీ 20 సమ్మిట్‌లో భాగంగా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ స్థాపన కోసం అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేశాయి.

IMEC ప్రాజెక్ట్ భారతదేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. ఇది ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ మధ్య వివిధ కోణాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, కనెక్టివిటీని బలోపేతం చేయడానికి ఎక్కువ పెట్టుబడికి దారి తీస్తుంది. ఇండియా-యూరోప్ మధ్య ఆర్థిక ఏకీకీరణను ప్రోత్సహించడానికి ఈ కారిడార్ సహాయపడుతుందని ప్రధాని మోదీ పదేపదే నొక్కిచెప్పారు.

అయితే, ప్రధానంగా గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తర్వాత మిడిల్ ఈస్ట్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాజెక్ట్‌లో జాప్యం ఏర్పడింది. పాలస్తీనాకు సంబంధించి శాంతి చర్చలు జరపాలని ఇండియా చాలా రోజులుగా పిలుపునిస్తోంది. తాజాగా జీ7 దేశాల ప్రతినిధుల సమావేశంలో IMEC పై తీసుకున్న నిర్ణయం భారతదేశానికి గొప్ప విజయంగా అభివర్ణించవచ్చు.

Also Read: G7 Summit 2024: జీ7 సమ్మిట్.. వివిధ దేశాల సుప్రీమ్స్‌తో ప్రధాని మోదీ భేటీ..

ఇటలీలో జరిగిన జీ7 సమ్మిట్‌లో ఇటలీ ప్రధాని మెలోని ఆహ్వానం మేరకు పాల్గొన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్ ఈ సదస్సులో పాల్గొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News