Big Stories

US Mass Shooting: అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల కలకలం.. 10 మందికి గాయాలు

US Mass Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మిచిగాన్‌లోని డెట్రాయిట్ శివారులోని రోచెస్టర్ హిల్స్‌లోని స్ప్లాష్ ప్యాడ్ వద్ద ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. వేసవి తాపాన్ని అధిగమించడానికి కుటుంబాలు నీటిలో సేదతీరుతుండగా దుండగుడు కాల్పులు జరపడంతో 10 మంది గాయపడ్డారు. అందులో ఓ ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉంది.

- Advertisement -

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. దుండగుడు కాల్పులకు తెగబడిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

ఈ ఘటనపై ఓక్లాండ్ కౌంటీ షెరీఫ్ మైఖేల్ బౌచర్డ్ స్పందించారు. మిచిగాన్‌లోని రోచెస్టర్ హిల్స్‌లోని బ్రూక్‌ల్యాండ్స్ ప్లాజా స్ప్లాష్ ప్యాడ్ పార్క్ ముందు సాయంత్రం 5 గంటలకు ఒక వ్యక్తి వాహనం నుంచి దిగి 9mm సెమీ ఆటోమేటిక్ గ్లాక్ నుంచి దాదాపు 30 షాట్లు కాల్చాడని మైఖేల్ బౌచర్డ్ తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) టెక్సాస్‌లోని రౌండ్ రాక్‌లోని ఒక పార్కులో సాయుధుడు కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు.

ఓల్డ్ సెటిలర్స్ పార్క్ వద్ద రాత్రి 11 గంటల సమయంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన పోరుతో కాల్పులు జరిగాయని రౌండ్ రాక్ పోలీస్ చీఫ్ అలెన్ బ్యాంక్స్ తెలిపారు. ఒక సాయుధుడు కాల్పులు జరిపాడని, పలువురిపై దాడి చేశాడని ఆయన తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News