Big Stories

US Independence Day 2024: అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం..చరిత్ర, ప్రత్యేకతలు

US Independence Day 2024: అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జూలై 4వ తేదీన జరుపుకుంటారు. అమెరికా అంతటా ఈ రోజు ప్రజలు స్వాతంత్ర్య వైభవాన్ని ఆస్వాదిస్తూ వీధుల్లో ఊరేగింపులు, నినాదాలతో సంబరాలు జరుపుకుంటారు. అమెరికా ఇండిపెండెన్స్ డేకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

తేదీ, చరిత్ర:
మనం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటామో అమెరికా ప్రజలు ఇండిపెండెన్స్ డేను జూలై 4న  ఆ విధంగా జరుపుకుంటారు, 1775లో కింగ్ జార్జ్ -3 నాయకత్వంలో బ్రిటీష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందటానికి పదమూడు అమెరికన్ కాలనీలు తిరుగుబాటు చేశాయి. దీంతో అమెరికన్ విప్లవం ప్రారంభమైంది. బ్రిటిష్ అణచివేత విధానాల నుంచి విముక్తి పొందాలనే దృఢ సంకల్పం, స్వపరిపాలన చేసుకోవాలనే ఆకాంక్ష ఈ స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు నడిపించింది. 1776 జూలై 4న స్వాతంత్ర్య ప్రకటనను ఆమోదించి ప్రకటించారు. అనంతరం జూలై8 న 1776 స్వాతంత్ర్య ప్రకటనను బహిర్గతం చేశారు. 1776 ఆగస్టు 2న అమెరికా స్వాతంత్ర్య ప్రకటనపై అధికారికంగా సంతకాలు జరిగాయి.

- Advertisement -

జూలై 4న అమెరికా స్వతంత్ర రాజ్యాంగా అవతరించింది. బ్రిటీష్ అణచివేత పాలన నుంచి విముక్తి సాధించింది. అందుకే ఈ రోజున అమెరికన్లు దేశభక్తితో ఆనందోత్సాహాలతో వేడుకను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా కచేరీలు, నినాదాలు, పరేడ్ లు నిర్వహిస్తారు. 2024 జూలై 4 వ తేదీన దేశ వ్యాప్తంగా  248 వ ఇండిపెండెన్స్ డేను ఘనంగా ప్రజలు జరుపుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలల్లో ఉత్సాహంగా పాల్లొంటున్నారు.

భారత్ అమెరికా మధ్య సంబంధాలు దశాబ్దకాలం గణనీయంగా పెరిగాయి. యునైటెడ్ స్టేట్స్ లో విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 1862 నాటి మోరిల్ చట్టం, ల్యాండ్ గ్రాండ్ కళాశాలలను ప్రారంభించింది. ఫలితంగా అమెరికా ఉాన్నత విద్య పరివర్తనకు దారి తీసింది. దీంతో 2023 వరకు అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది రెండు దేశాల మధ్య లోతైన విద్య, ఆర్థిక సంబంధాలకు అద్దం పడుతుంది. ఉన్నత విద్య కోసం వివిధ ప్రాంతాల నుంచి అమెరికాకు వస్తుంటారు.

అమెరికన్ యువత విద్యా వ్యవస్థ మెరుగుపరిచేందుకు ఇది ఉపయోగపడింది. ఈ చట్టం విద్యను ప్రజాస్వామ్యం చేసింది. అంతేకాకుండా ఇది సమాజంలో విస్తృత విభాగానికి కూడా అందుబాటులోకి వచ్చింది. 20వ శతాబ్ద కాలంలో GI బిల్లు విద్యను మరింత విస్తృత పరిచింది. తిరిగి వచ్చిన సైనికులు ఉన్నత విద్యను అభ్యసించడానికి, యుద్ధానంతరం ఆర్థిక వృద్ధికి ఇది దోహదపడింది.

మారుతున్న ప్రపంచం యొక్క డిమాండ్లకు అనుగుణంగా అమెరికన్ విశ్వవిద్యాలయాలు నిరంతరంగా ఆవిష్కరణలు రూపొందిస్తున్నాయి. అంతే కాకుండా తరచుగా ప్రముఖ పరిశ్రమల సహకారంతో సంచలనాత్మక పరిశోధనలలో కూడా ముందుంటున్నాయి, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, వంటి టెక్ దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యాన్ని అమెరికా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News