Big Stories

US baned Kaspersky Antivirus software: అమెరికా సంచలన నిర్ణయం, కాస్పర్ స్కై సాప్ట్‌వేర్‌పై బ్యాన్

US baned Kaspersky Antivirus software: అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అగ్రరాజ్యం అమెరికా లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తాజాగా అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యాకు చెందిన ప్రముఖ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌పై నిషేధం విధించింది.

- Advertisement -

ముఖ్యంగా కంప్యూటర్స్‌ (సిస్టమ్స్)కు అవసరమైన యాంటీ‌ వైరస్ సాఫ్ట్‌వేర్ కాస్పర్ స్కైపై అక్కడి వాణిజ్య శాఖ వేటు వేసింది. దీంతో కాస్పర్ స్కై యాంటీ వైరస్ సాప్ట్‌వేర్‌‌ను అక్కడ వినియోగించరు. అంతేకాదు విక్రయించడానికీ అంగీకరించదు. ఇప్పుడున్న ఆ యాంటీ వైరస్ సాప్ట్‌వేర్‌ అప్‌డేట్ చేయడానికి వీలుపడదన్నమాట.

- Advertisement -

ఈ వైరస్ ద్వారా అమెరికా సమాచారాన్ని సేకరించి ఆయుధాలుగా మార్చడానికి కాస్పర్ స్కై ఉపయోగపడు తుందనేది అమెరికా ప్రభుత్వ భావన. ఈ విషయాన్ని పదేపదే రష్యా నిరూపించిందని అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి గినా రైమోండో తెలిపారు. రష్యా టెక్నాలజీ అమెరికాకు, తమ పౌరులకు ముప్పుగా పరిణమించినప్పుడు ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి వెనుకాడబోమని తెలియజేశారు.

యాంటీ వైరస్ సాప్ట్‌వేర్‌ కాస్పర్ స్కై‌తో సంబంధమున్న మూడు సంస్థలను నిషేధిత జాబితాలోకి చేర్చింది అమెరికా. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 29 వరకు మాత్రమే అమెరికాలో యాంటీ వైరస్ అప్‌డేట్లను అందించడం, సహా కొన్నికార్యకలాపాలను కొనసాగించడానికి మాత్రమే దీన్ని అనుమతి ఇచ్చారు.

ALSO READ: సముద్రంలో ఫిలిప్పీన్స్ నేవీపై కత్తులు, గొడ్డళ్లతో చైనా దాడి

రష్యా రాజధాని మాస్కోలో కాస్పర్ స్కై కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 31 దేశాల్లో కార్యాలయాలను కలిగివుంది. 200 దేశాల్లో 400 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. ఒక్కో విషయం ఏంటంటే.. 2 లక్షల 70 వేల కార్పొరేట్ క్లయింట్లకు ఈ కంపెనీ సేవలు అందిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News