Big Stories

Rishi Sunak: ఎన్నికల వేళ ట్రోలవుతున్న రిషి సునాక్.. కారణమిదే

Rishi Sunak trolled: యూకేలో జులై 4న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ పై విమర్శలు వస్తున్నాయి. స్వదేశీ ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఆయన తాజాగా వ్యాఖ్యనించారు. విదేశీ కూరగాయలు, పండ్లపై ఆధారపడటాన్ని ఎలా తగ్గించుకోవాలో సూచిస్తూ స్థానిక ఉత్పత్తులకు అండగా నిలవాలంటూ రిషి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దేశ ప్రజలు బ్రిటీష్ ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలంటూ సునాక్ పిలుపునివ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

- Advertisement -

‘విదేశీ ఆహారంపై మనం ఆధారపడకూడు. బ్రిటీష్ వి కొనండి’ అంటూ రిషి సునాక్ సోషల్ మీడియా వేదిక(ఎక్స్)గా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ పై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అది అసాధ్యమంటూ కొట్టిపారేస్తున్నారు. దేశం వ్యవసాయ సంక్షోభం ఎదుర్కొంటున్నవేళ స్థానిక వస్తువులను కొనుగోలు చేయడం ఎంతో కష్టమంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Also Read: తైవాన్‌ చేతికి అమెరికా సాయుధ డ్రోన్లు..శత్రువులకు చుక్కలే!

బ్రిటీష్ వ్యవసాయం సంక్షోభంలో ఉందంటూ మీ ప్రభుత్వమే పేర్కొన్నది.. దిగుమతులను అనుమతించి స్థానిక ఆహార పదార్థాలను పాడు చేశారంటూ ఓ మహిళా యూజర్ రిషి సునాక్ వ్యాఖ్యలపై ఫైరయ్యింది. ‘సూపర్ మార్కెట్లలో ర్యాక్ లన్నీ ఖాళీగా ఎందుకు కనిపిస్తున్నాయి..? మనం అవసరమైన ఆహార పదార్థాలను పండించుకోలేకపోతున్నామంటూ మరో యూజర్ మండిపడ్డారు. బ్రెగ్జిట్ వల్ల ఇటువంటి సమస్యలు పరిష్కారమవుతాయని అప్పట్లో చెప్పారని.. ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నదంటూ ఇంకొందరు విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు.. రిషి సునాక్ పై సొంత పార్టీ నేతలే కాదు విపక్షం నుంచి కూడా భారీగా విమర్శలు వస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News